Political News

దేశం విడిచి పారిపోతున్నారా ?

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా భయంకరంగా తయారవుతున్నాయి. రోజు రోజుకు తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో ఏమి చేయాలో అర్థం కాక చివరకు దేశం వదిలి పారిపోతున్నారు. ప్రతిరోజు వందల మంది దేశం సరిహద్దులను దాటి పోతున్నారు. వీరిలో కొందరు భారత్ లోకి అడుగుపెడుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన వారిలో కొందరు పాకిస్థాన్ లోకి వెళిపోతుంటే మరికొందరు నాన అవస్థలు పడి భారత్ లోకి వచ్చేస్తున్నారు.

మామూలు జనాల విషయాన్ని పక్కన పెట్టేస్తే చివరకు దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే కుటుంబంతో సహా దేశాన్ని విడిచి గల్ఫ్ దేశాలకు కానీ లేదా అమెరికాకు కానీ పారిపోయి తలదాచుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దేశాధ్యక్షుడే దేశాన్ని వదిలి పారిపోయే ఆలోచనలో ఉన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమైపోతోంది.

రాజధాని కాబూల్ కు 11 కిలోమీటర్ల దూరంలో చుట్టుపక్కల ఉన్న నగరాలను, పట్టణాలను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించారు. శుక్రవారం కాందహార్ ను తమ ఆధీనంలోకి తాలిబన్లు తీసేసుకున్నారు. దాంతో కాబూల్ ను ఆక్రమించడానికి ఎక్కువ రోజులు పట్టదని అధ్యక్షుడు ఘనీకి బాగా అర్థమైపోయింది. తాలిబన్లతో పోరాడేంత సీన్ సివిల్ పోలీసులకు కానీ మిలిటరీకి కూడా లేదు. ఈ విషయం తాలిబన్లకు బాగా తెలియడం వల్లే అత్యంత అధునాతన ఆయుధాలతో తీవ్రవాదులు విరుచుకుపడుతున్నారు.

కాల్పుల విరమణ పాటించాలని, జనాల ఊచకోతను మానుకోవాలని ఐక్య రాజ్య సమితి ఎంత మొత్తుకుంటున్నా తాలిబన్లు పట్టించుకోవటంలేదు. దేశంలో ఉన్న 400 జిల్లాల్లో ఇప్పటికే సుమారు 70 శాతం జిల్లాలు తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్ళిపోయాయి. తమ ఆధీనంలో ఉన్న భూభాగంలో తాము రూపొందిచింన షరియా చట్టాలను మాత్రమే అమల్లో ఉంటాయని తాలిబన్లు స్పష్టంగా ప్రకటించేశారు. రోడ్లమీద కనిపించిన జనాలను అకారణంగా తాలిబన్లు కాల్చి చంపేస్తున్నారు.

ఇళ్లల్లోకి జొరబడి ఆడవాళ్ళను, అమ్మాయిలను ఎత్తుకు పోతున్నారు. వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఎదురుతిరిగిన వాళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటి అరాచకాలను తట్టుకోలేక చివరికి జనాలు దేశం వదిలి పారిపోతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని పరిస్థితులే దాదాపు పాకిస్ధాన్ లో కూడా ఉండటంతో అక్కడ ఉండటం ఇష్టం లేక జనాలు భారత్ లోకి వచ్చేస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు ? ఎలా సర్దుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

This post was last modified on August 15, 2021 10:57 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago