ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను.
కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా డెల్లాయిట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని నిర్ణయించాం. ఈనెల 11వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాం. తద్వారా స్థలాల కేటాయింపులు ఎవరెవరికి ఎలా జరిగాయి. ఎంత ధరలకు ఇచ్చారనే అన్ని విషయాలు తేల్చాలని భావించాం.
కానీ కార్యదర్శి మురళీముకుంద్ పాత పాలకవర్గం తప్పులను బయటపెట్టే ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారు. కమిటీ నిర్ణయాల అమలుకు కార్యరూపం ఇవ్వాల్సిన కార్యదర్శి ఫైళ్ళను తన ఆధీనంలోనే ఉంచేసుకున్నారు. అసలు గత కొంతకాలంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారికి అండగా నిలవాలనే వైఖరితోనే ఉన్నారు. తన అధీనంలో ఉన్న ఫైళ్ళను ఇంటి వద్దకు తీసుకెళ్ళడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. కొంత మంది సభ్యులకు సంబంధించిన న్యాయమైన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్ళను కూడా పెండింగులో పెట్టేశారు. కార్యాలయంలో ఫైళ్లు ఉన్న లాకర్లకు తాళం వేసుకుని వెళ్ళారు. ఎవరి అక్రమాలను బయటపెడతామని నమ్మి సభ్యులు మమ్మల్ని గెలిపించారో ఆ పాత పాలకవర్గంలోని పెద్దలతో మురళీ ముకుంద్ కుమ్మక్కయ్యారు. వాళ్ళ అవినీతి బయటికి రాకుండా కుట్ర పన్నారు. అందులో భాగంగానే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు, సహకార శాఖకు తప్పుడు ఫిర్యాదులు చేశారు.
ఈనెల 11 వ తేదీన జరిగిన సమావేశంలో తనపై ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని మురళీ ముకుంద్ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు. అక్కడ ఏం జరిగిందనే దానికి హాజరైన సభ్యులే సాక్ష్యం. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూసినా తేటతెల్లమవుతుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంది. వాటి ద్వారా మా చిత్తశుద్ధి ఏంటో నిరూపితమవుతుంది. మురళీ ముకుంద్ ఏ ప్రయోజనాలను ఆశించారో కానీ గత పాలకవర్గంతో లాలూచీ పడ్డారు. తాను వాళ్ళతో చేరిపోయానని, పాలకవర్గాన్ని రద్దు చేయిస్తానని, ఇంకెవరికో ధారాదత్తం చేస్తానని అంటున్న ఆడియో రికార్డింగ్‌లు కూడా బయటికొచ్చాయి. ఇవి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాయి.
ఈ పరిస్థితుల్లోనే బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు మురళీముకుంద్ వైఖరిని తప్పుపట్టారు. దాంతో ఆయనే సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో సభ్యుల హక్కులను కాపాడే క్రమంలో పాలకవర్గం కార్యదర్శి అధికారాలను తప్పించేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ సొసైటీ ప్రెసిడెంట్‌కు దఖలుపరుస్తూ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సొసైటీ బైలాస్‌లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. సొసైటీ అధ్యక్షుడు స్వయంగా ఎన్ని సార్లు అడిగినా, మొత్తం మేనేజింగ్ కమిటీ చెప్పినా ఫైళ్ళను ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన గత పాలవర్గంలో అక్రమాలు చేసిన వారితో కుమ్మక్కయ్యారనేది తేలిపోయింది. దీనివల్లే అయనకున్న అధికారాలను తొలగించాం. దీనికి సంబంధించిన వివరాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమాలను నిరోధించి తీరుతాం. సభ్యులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
ప్రెసిడెంట్
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ
This post was last modified on August 14, 2021 8:57 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…