Political News

ఏపీలో చెలిమి పేరిట క‌మ‌లం చెల‌గాటం ?

ఏపీలో రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. ఒక వైపు వైసీపీ అధికారంలో ఉంది. మరో వైపు టీడీపీ విపక్షంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకే ఏపీలో బేస్ ఉంది. జనాల్లో ఆదరణ ఉంది. అయితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఈ పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలని, తన మాటే వినాలని కావాలనే వెంట తిప్పుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు ఉన్న ఇబ్బందులు, గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా బీజేపీని వీడలేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దాంతో మిగిలిన పార్టీలకు ఈ రెండు పార్టీల పొలిటికల్ స్టాండ్ ఏంటో అసలు అర్ధం కావడంలేదు.

కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని అతి పెద్ద ప్రయత్నం జరుగుతోంటే ఏపీ నుంచి మాత్రం ఈ రెండు పార్టీల ఉలుకూ పలుకూ అసలు లేవు. ఏపీలో బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది. అదే టైమ్ లో బీజేపీ టీడీపీ అసలు కలవకూడదు అన్న ఒకే ఒక అజెండాతో వైసీపీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం ఇష్టం లేకపోయినా అనివార్యంగా బీజేపీతో స్నేహం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ ఆ విధంగా మద్దతు ఇస్తోంది.

దీని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా కానీ ఏపీకి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా పంటి బిగువున బీజేపీతో చెలిమి చేస్తున్నట్లుగా వైసీపీ రాజకీయ నాటకమే ఆడుతోంది అంటున్నారు. ఇక టీడీపీది అదే సీన్. వైసీపీ, బీజేపీ కలసికట్టుగా ఉంటే ఏపీలో తన రాజకీయం పండదు అనేదే టీడీపీ లెక్క. అందుకే ఎలాగైనా వైసీపీ నుంచి బీజేపీని విడగొట్టాలన్నది టీడీపీ పంతం పట్టుదల. అవసరం అయితే తాను బీజేపీ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ అంటూ పసుపు పార్టీ సంకేతాలు పనంపుతోంది. బీజేపీ విషయం తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను అలా తన చెప్పుచేతలలో ఉంచుకోవాలన్నదే వ్యూహం.

వైసీపీని చేరదీస్తున్నట్లుగా కనిపిస్తూనే టీడీపీకి కూడా దూరం కాకూడదు అన్న ఎత్తుగడ. వీటికి మించి బీజేపీకి ఉన్న మరో ప్లాన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు యాంటీ మోడీ క్యాంప్ లో చేరకూడదు. అందుకోసం వాటితో చెలిమి పేరిట కమలం చెలగాటమే ఆడుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో స్నేహాలు ఏవీ ఉండవు. అన్నీ అవసరాలే. అందువల్ల అలాంటి అవసరాలతో ఏపీలో మూడు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది. ఇందులో విజేతలు ఎవరు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు వస్తేనే తప్ప తెలియదు.

This post was last modified on August 12, 2021 2:10 pm

Share
Show comments

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

9 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

11 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

12 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

13 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

14 hours ago