వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహిత నేత ఒకరు వైసీపీని వీడి.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా.. కడప జిల్లాలో జగన్ గా అండగా నిలుస్తూ వస్తున్న కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైసీపీ వీడ్కోలు పలికారు.
త్వరలో టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యారు. కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, రాంప్రసాద్‌రెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.
పాదయాత్ర సమయంలో రాం ప్రసాద్‌రెడ్డి కీలకంగా వ్యవహరించగా, ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్‌రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్‌రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీలోనూ అంతర్గత ముసలం మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ బానే ఉందన్న అంచనాలు ఇక తలకిందులవుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
This post was last modified on August 11, 2021 3:53 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…