మరో ఏడు నెలల్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లు లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీ మీద బాగా గుర్రుగా ఉండటమే. యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం ఉన్నారు. అదే ఓటర్లపరంగా చూస్తే బ్రాహ్మణుల శాతం 20. 20 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు. ఓ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టాలన్నా, దింపేయాలన్నా 20 శాతం ఓట్లు సరిపోతాయి.
ఈ విషయం బాగా తెలియటం వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ నానా అవస్తలు పడుతున్నారు. యూపీలో అసలు సమస్య ఏమిటంటే యోగి పాలన వల్లే బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీకి దూరమైంది. గడచిన నాలుగేళ్ళల్లో సుమారు 500 మంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారని అఖిల భారత బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు రాజేంద్రనాద్ త్రిపాఠి ఆరోపించారు.
ఇంతేకాకుండా ఓ పద్దతి ప్రకారం బ్రాహ్మణులను యోగి ప్రభుత్వం అణిచివేస్తోందని సామాజికవర్గంలోని ప్రముఖులు పదే పదే ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణ సంఘాల్లోని ప్రముఖుల్లో అత్యధికులు బీజేపీ మీద ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యోగిపై మండిపోతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మీద బ్రాహ్మణుల దెబ్బ పడటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రమాధాన్ని గ్రహించటం వల్లే మోడి, అమిత్ ఇద్దరు బ్రాహ్మణ నేతలను బుజ్జగించేపనిలో పడ్డారు.
2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నా, 2019లో బీజేపీకి మెజారిటి లోక్ సభ సీట్లు వచ్చాయన్నా బ్రాహ్మణుల మద్దతు ఇవ్వటమే అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆప్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్) అనే సంస్ధ తేల్చిచెప్పింది. నిజానికి యూపీలో బ్రాహ్మణులు, యాదవులు, ముస్లింలు, ఎస్సీలదే కీలకపాత్ర. ఈ సామిజివకర్గాల్లో మెజారిటి ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తాయో ఆ పార్టీదే అధికారం. ఒకపుడు నాలుగు సామాజికవర్గాలు కాంగ్రెస్ తో నే ఉండేవి. అయితే రాజకీయ పరిణామాల కారణంగా సామాజికవర్గాల్లో చీలికలు వచ్చాయి.
యాదవులు, ముస్లింలు ఎస్పీ వైపు ఎస్సీలు బీఎస్పీలోకి, బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా చీలిపోయారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అన్నీ సామాజికవర్గాలు అన్నీ పార్టీల్లోకి మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇపుడు బ్రాహ్మణులను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ+బీఎస్పీ కూడా నానా అవస్తలు పడుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీలు బ్రాహ్మణ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే సీఎం పదవిని బ్రాహ్మణులకే కేటాయిస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా దూరమైన బ్రాహ్మణులను బుజ్జగించటానికి నానా అవస్తలు పడుతోంది. మరి ఈ సామాజికవర్గం చివరకు ఏమి చేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on August 9, 2021 2:38 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…