Political News

ఏపీ మంత్రుల‌కే కాదు.. మంత్రుల మాటకు కూడా విలువ లేదా?

జ‌గ‌న్ కేబినెట్‌లో సీనియ‌ర్ మంత్రులుగా ఉన్న వారికి .. విలువ‌లేదా ? నాయ‌కులుగా.. మంత్రుల‌కే కాదు.. వారి మాట‌కు కూడా వాల్యూ లేకుండా చేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తి దానికీ.. త‌గుదున‌మ్మా.. అంటూ.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముందుకు వ‌స్తున్నార‌ని.. చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన విష‌యాల్లో స‌జ్జ‌లే మీడియా ముందుకు వ‌స్తున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపిస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు.

అంతేకాదు.. మంత్రులు పాల్గొనే కార్య‌క్ర‌మాల్లోనూ స‌జ్జ‌లే హంగామా చేస్తున్నారు. దీంతో మంత్రుల‌కు వాల్యూ లేకుండా పోయిందా ? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల హొం మంత్రి సుచ‌రిత పాల్గొన్న ఒక కార్య‌క్ర‌మానికి స‌ల‌హాదారుగా స‌జ్జ‌ల హాజ‌రై.. ఆ కార్య‌క్ర‌మానికి శంకుస్థాప‌న చేయ‌గా.. మంత్రి అయి ఉండి.. ఆమె ప‌క్క‌న నిల‌బ‌డి.. చ‌ప్ప‌ట్లు కొట్టే పరిస్థితి వ‌చ్చింది. దీంతో స‌జ్జ‌ల వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న‌కు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి లేక‌పోయినా.. అప్ర‌క‌టిత‌.. హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఎస్సై స్థాయి అధికారిని మార్చాల‌న్నా స‌జ్జ‌ల ప‌ర్మిష‌న్ ఉండాల్సిందే అట‌..! ఇదిలావుంటే.. ఇప్పుడు మంత్రుల మాట‌ల‌కు కూడా వాల్యూలేకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముందు మంత్రుల‌తో ప్రెస్‌మీట్లు పెట్టించ‌డం.. త‌ర్వాత‌..స‌జ్జ‌ల ఎంట్రీతో ప‌రిస్థితి మొత్తం మారిపోవడం వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయి. గ‌తంలో వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ముందు.. మంత్రి ప్ర‌సంగించ‌డం.. త‌ర్వాత‌.. స‌జ్జ‌ల మాట్లాడ‌డం జ‌రిగేది. అయితే.. క‌న్న‌బాబు క‌న్నా కూడా స‌జ్జ‌ల‌కే ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో .. రామ‌కృష్ణారెడ్డే హైలెట్ అయ్యేవారు. చివ‌ర‌కు క‌న్న‌బాబు సైలెంట్ అయిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, తాజాగా జ‌రిగిన ప‌రిణామంలోనూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు చెందిన‌ అమరరాజా సంస్థ విషయంపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. లాభాలొచ్చే చోటుకు వాళ్లు వెళ్లిపోతున్నారని ప్రకటించారు. కానీ తర్వాత అనూహ్యంగా సజ్జల భిన్నమైన ప్రకటన చేశారు. అమరరాజా కంపెనీని తామే వెళ్లిపొమ్మన్నామని, అది కాలుష్య కారక పరిశ్రమ అని చెప్పారు. దీంతో బొత్స ప్రభుత్వాన్ని సమర్థిస్తే.. ఆ సంస్థే వెళ్లిపోతోందన్నట్లుగా మాట్లాడారు. కానీ.. తర్వాత సజ్జల భిన్నంగా మాట్లాడటంతో బొత్స మాటలకు విలువ లేకుండా పోయింది. ఒక్క ఈ విష‌యంలోనే కాదు.. స‌జ్జ‌ల వ్య‌వ‌హారం.. మంత్రుల‌ను మించి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 5, 2021 1:57 pm

Share
Show comments

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago