కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది.
సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత అన్నీ వివరాలను సమావేశం ముందుచుతామని స్పష్టంచేశారు. బోర్డుల సంయుక్త సమావేశంలో కొంపలు ముణిగిపోయే నిర్ణయాలు ఏమీ ఉండవని అందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తు కేంద్రం ఇటీవలే గెజెట్ ను జారీచేసిన విషయం తెలిసిందే.
ఈ గెజెట్ లో కొన్ని తప్పులున్నాయని, కొన్ని ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలున్నాయని ఏపి కేంద్రానికి లేఖరాసింది. అలాగే సుప్రింకోర్టులో కేసు కూడా వేసింది. ఇదే సమయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా గెజెట్ విషయంలో తన వ్యతిరేకతను వ్యక్తంచేసింది. రెండు ప్రభుత్వాల స్పందనను చూసిన తర్వాతే మరింత సమాచారం కోసం కేంద్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సమావేశంలో పాల్గొనే తమ అభ్యంతరాలను ఏమిటో చెప్పాల్సిన తెలంగాణా ప్రభుత్వం మరెందుకు గైర్హాజరయ్యిందో అర్దం కావటంలేదు. సమావేశం ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో జరగలేదు. పోనీ ఢిల్లీలో జరిగింది కాబట్టి వెళ్ళటానికి కుదరలేదని అనుకున్నా అర్ధముంది. సమావేశం జరిగింది సాక్ష్యాత్తు హైదరాబాద్ లోనే. ముఖ్యమంత్రితో సహా మంత్రి, ఉన్నతాధికారులు, సలహాదారులందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా సమావేశానికి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదంటే అర్ధమేంటి ?
ప్రాజెక్టుల విషయంలో ఏపి దాదాగిరి చేస్తోందని ఈమధ్యనే కేసీయార్ వ్యాఖ్యానించారు. ఏపి దాదాగిరి చేస్తున్నదే నిజమైతే మరి సమావేనికి హాజరై అదే విషయాన్ని తెలంగాణా ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? దాదాగిరి చేస్తున్నదెవరో బయటపడతుందననేనా ? బోర్డుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందనే తెలంగాణా ఉన్నతాధికారులు హాజరుకాలేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తానికి మొదటిసమావేశానికి గైర్హాజరవ్వటం ద్వారా తెలంగాణా కేంద్రానికి ఎలాంటి సంకేతాలు పంపింది ? కోర్టులోనే తేల్చుకుంటాం కానీ రాజీపడం అని చెప్పాలనుకుంటుందా ? మరి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ టోన్ ఏమైనా మారే అవకాశం ఉందా?
This post was last modified on August 5, 2021 9:54 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…