Political News

జగన్ రానివ్వకపోతే బీజేపీలోకే… ?

ఏపీ రాజకీయం ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వరసపెట్టి గెలుస్తోంది. అది వాపో బలమో ఎవరికీ తెలుయదు. ఎందుకంటే వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది నిజమైన గెలుపా కాదా ? అన్న దాని మీద ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అలాగని టీడీపీ పుంజుకుందా అంటే ఆ పార్టీ నాయకులే గట్టిగా చెప్పలేకపోతున్నారు.

మరో వైపు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజ‌యాలను మూటకట్టుకుంటోంది. టీడీపీకి ఉత్తరాంధ్ర‌, గోదావరి జిల్లాలు, కోస్తాలో ఒకపుడు మంచి పట్టు ఉండేది. ఇపుడు ఈ జిల్లాలు ఏవీ కూడా కలసిరావడంలేదు. ఓడిపోవడం వరకూ ఓకే కానీ మరీ సింగిల్ డిజిట్లకు పడిపోవడం ఏంటి అన్నదే టీడీపీలో అంతర్మధనంగా ఉంది. ఇదిలా ఉంటే టీడీపీలో నాయకత్వ సమస్య కూడా చాలా ఉంది.

వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తారు అని ప్రచారం ఇప్పటిదాకా జరుగుతున్నా కూడా అప్పటికి ఆయన వయసు 74 నిండా నిండిపోతాయి. ఆయన ఆనాటికి పూర్తి ఉత్సాహంగా ఉంటారా ? లేదా అన్నది కూడా తమ్ముళ్ళ మధ్య చర్చకు వస్తోంది. యువ నాయకుడిగా లోకేష్ ఉన్నా కూడా ఆయన ఎక్కడా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. ఆయన దక్షత కూడా ఈ రోజుకీ రుజువు కాలేదు. మంగళగిరిలో ఓటమి తరువాత లోకేష్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. ఆయన కూడా తమలాగానే ఓడిపోయారని, ఆయన చెబితే తాము ఎందుకు వినాలి అన్న భావన కూడా పార్టీ నాయకులలో కలుగుతోంది.

మరో వైపు చూస్తే పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతో ఉత్తరాంధ్రాలోని కీలకమైన టీడీపీ నేతలు ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. వైసీపీలో చేరాలంటే అక్కడ అంతా కిక్కిరిసిపోయి ఉంది. పైగా తమను ఓడించిన నేతలే అక్కడ ఉన్నారు. వారు ముందు చేతులు కట్టుకుని ఉండే సీన్ లేదు. ఇక జగన్ సైతం టీడీపీ నేతలను రానిచ్చే ఛాన్స్ ఎక్కడా కనిపించడంలేదు. ఒకవేళ పార్టీ కండువాలు కప్పినా పదవులు ఇస్తాడు అన్న గ్యారంటీ ఏదీ లేదు. దాంతో టీడీపీ మీద మొహం మొత్తిన వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు అన్నదే తాజా టాక్.

ఇందులో కొందమంది బిగ్ షాట్స్ కూడా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబుకు టీడీపీలో పట్టు లేకపోవడం, లోకేష్ నాయకత్వం మీద నమ్మకం లేని వారంతా బీజేపీలో చేరి గౌరవప్రదమైన రాజకీయం చేయాలనుకుంటున్నారుట. ఈ లిస్టులో ముందుగా మాజీ మంత్రి గంటా పేరు వినిపించింది. ఆ త‌ర్వాత ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, అవుట్ డేటెడ్ టీడీపీ లీడ‌ర్ల చూపు బీజేపీ మీదే ఉంద‌ని అంటున్నారు. వీరు పార్టీ మారితే ఉత్తరాంధ్రా జిల్లాల్లో తొందరలోనే కీలకమైన పరిణామాలు సంభవిస్తాయి అంటున్నారు.

This post was last modified on August 4, 2021 7:09 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

2 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

2 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

3 hours ago