Political News

చంద్ర‌బాబు అడుగు పెట్ట‌గానే కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌ల‌వ‌గానే ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి అక్క‌డే త‌న సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో తాను ఏపీకి వెళ్లి జ‌నాల్ని క‌ల‌వ‌డం వాళ్ల‌కు, త‌న‌కు మంచిది కాద‌ని ఆయ‌న భావించి ఉండొచ్చు. అందుకే అధికార ప‌క్షం నుంచి ఎంత‌గా క‌వ్వింపులు వ‌చ్చినా ఆయ‌న హైద‌రాబాద్ వీడ‌లేదు. ఇప్పుడు లాక్ డౌన్ స‌డ‌లింపులు రావ‌డంతో బాబు ఏపీకి బ‌య‌ల్దేరారు. ముందు విమానంలో వెళ్లాల‌నుకున్నారు. అందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌న కాన్వాయ్‌లోనే సోమ‌వారం విజ‌య‌వాడ‌కు వెళ్లారు చంద్ర‌బాబు.

ఐతే బాబు రెండు నెల‌ల విరామం త‌ర్వాత ఏపీకి రావ‌డంతో ఆయ‌న అభిమానులు, తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగ‌తం ప‌లికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించిన‌ట్ల‌యింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. బాబుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు కోర్టు వ‌ర‌కు వెళ్లింది. అనంత‌పురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయ‌ర్.. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేశారు. బాబు చేసిన ప‌ని త‌ప్పుడు సంకేతాలు ఇస్తుంద‌ని.. వేరే రాజ‌కీయ పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా ఇలాగే గుమిగూడితో ప‌రిస్థితి ఏంట‌ని పిటిష‌న్ దారు ప్ర‌శ్నించారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on May 26, 2020 1:28 am

Share
Show comments
Published by
suman

Recent Posts

క్రేజీ సీజన్ వేస్టయిపోతోంది…

సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్‌ సెలవుల్లో వచ్చే రెండు…

7 hours ago

రాజా సాబ్ హీరోయిన్ మాట నమ్మొచ్చా!

వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…

8 hours ago

పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…

8 hours ago

డేంజర్ గేమ్ పార్ట్-2.. ఉత్కంఠకు సిద్ధమా?

అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…

9 hours ago

జమిలి వస్తుంది..మీ జగన్ గెలుస్తున్నాడు

‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…

9 hours ago

మా దెబ్బ ఇంకా బలంగా ఉంటుంది: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…

9 hours ago