పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయించిన విషయం అందరికీ తెలిసిందే.
అసెంబ్లీలో వైసీపీకి బంపర్ మెజారిటి ఉన్నట్లే శాసనమండలిలో టీడీపీకి మంచి మెజారిటి ఉండేది. ఈ కారణంతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లులు మండలిలో వీగిపోయేవి. మండలిలో తనకు బలం ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం పంపిన ప్రతిబిల్లుకు టీడీపీ అడ్డంపడేది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీ అడ్డుకోవటంతో అప్పట్లో బాగా గొడవలయ్యాయి. జరిగిన గొడవలతో విసిగిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేయించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంటు సమావేశాలు పెద్దగా జరగలేదు. జరిగిన సమావేశాల్లో కూడా మండలి తీర్మానం అంశం చర్చకు రాలేదు. మారిన పరిణామాల్లో మండలిలో మొన్నటి జూన్ తో వైసీపీకి ఇక్కడ కూడా మెజారిటి వచ్చేసింది. దాంతో రెండు సభల్లోను ఎదురులేకపోవటంతో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది.
ఎప్పుడైతే మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చేసిందో అప్పటి నుండి మండలి రద్దుకు జగన్ కట్టబడుండాలని టీడీపీ నేతలు పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. మండలి రద్దు అంశం కేంద్రంలో ఏ దశలో ఉందో ఎవరు పట్టించుకోలేదు. అయితే టీడీపీ ఎంపి ప్రశ్నకు మంత్రి సమాధానంతో వైసీపీ ఎంఎల్సీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంటే మళ్ళీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి.
మండలిలో మెజారిటి వచ్చేసిందన్న ఉద్దేశ్యంతో రద్దు తీర్మానంపై అధికారపార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. ఇపుడు గనుక కేంద్రం మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు చాలా ఇబ్బందనే చెప్పాలి. మంత్రి ప్రకటన ప్రకారం మండలి రద్దు అంశంపై రాష్ట్రప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదన్న విషయం అర్ధమైపోతోంది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు తెలీవు కానీ అసెంబ్లీ తీర్మానాన్ని పంపకపోతే మాత్రం జగన్ కు కేంద్రం షాకిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి జగన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on July 30, 2021 11:40 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…