ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు పరిశీలకులు. ఏపీ సీఎం జగన్ పరువు నిలవాలన్నా.. ఆయన తిరిగి గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలన్నా.. అచ్చంగా.. ఇప్పటికిప్పుడు లక్ష కోట్ల రూపాయలు కావాలని అంటున్నారు పరిశీలకులు. ఇంత మొత్తం ఉంటేనే తప్ప జగన్ పరువు నిలవదని కూడా అంటున్నారు. మరి దీనికి రీజనేంటి? ఎందుకు అంత మొత్తం కావాలి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు విషయం లో కేంద్రం చేతులు ఎత్తేసింది. 2014 సంవత్సరం నాటి అంచనాల మేరకు మాత్రమే పోలవరానికి నిధులు ఇస్తామని చెప్పింది. దీనిలో ఒక్కపైసా తగ్గించేది కానీ.. పెంచేది కాదని.. లేదని కుండబద్దలు కొట్టింది.
వాస్తవానికి 57 వేల కోట్ల రూపాయల పైచిలుకు.. ఖర్చవుతుందని.. 2017-18 అంచనాల మేరకు నిధులు పెంచాలని.. గత చంద్రబాబు హయాం నుంచి నేటి జగన్ వరకు కేంద్రానికి విన్నవిస్తున్నారు. అయినప్పటికీ.. కేంద్రం ఇవ్వడం లేదు. సో.. 2014 నాటి అంచనాల మేరకు 20 వేల కోట్ల రూపాయలకే కేంద్రం మొగ్గుచూపితో మరో 37 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర సర్కారు భరించాలి. పునరావాసం.. సహా డ్యామ్ నిర్మాణానికి పెరిగిన వ్యయాన్ని రాష్ట్రమే భవించాలి. జగన్ ఎన్నికలకుముందు.. ఇచ్చిన హామీ మేరకు పునరావాసం సహా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. దీని వ్యయమే 40 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది.
ఇక, జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘జగనన్న ఇళ్లు’ పథకం కింద.. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలైన అర్హులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దీనికి నిధులు ఇవ్వాలని.. జగన్ సర్కారు కోరింది. అయితే.. అలా ఇవ్వడం కుదరదని.. ఇచ్చినా.. తము చెప్పిన రీతిలోనే నిర్మాణాలు ఉండాలని.. షరతు విధించింది. ఇలా కనుక నిర్మిస్తే.. జగన్ పెట్టుకున్న లక్ష్యం పూర్తికాదు. సో.. కేంద్రం సహకారం లేకుండా ఈ ఇళ్లను నిర్మించాలంటే.. 25 వేల కోట్ల రూపాయలు కావాలని.. అధికారులు అంచనా వేశారు. అంటే.. అటు పోలవరం.. ఇటు జగనన్న ఇళ్లు కలిపి.. రాష్ట్రంపై 65 వేల కోట్ల భారం పడుతుంది.
ఇవన్నీ ఇలా ఉంచితే.. జగన్ పెట్టుకున్న మరో వ్యూహం.. పట్టణాల్లో మధ్యతరగతి వర్గానికి ఇళ్ల నిర్మాణం. దీనిలో కొంత మధ్యత రగతి భరించాల్సి ఉంటుందని.. ప్రకటించారు. అయితే.. భూముల కొనుగోలు ప్రక్రియకు 30 వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో లబ్ది దారులు సగం భరించినా.. మరో 15 వేల కోట్లు జగన్ భరించాలి. అదేసమయంలో జిల్లాల ఏర్పాటు జరిగితే.. మరో 20 వేల కోట్లు అవసరం.
ప్రతి జిల్లాకు అంటే.. కొత్తగా ఏర్పడే జిల్లాకు రెండు వేల కోట్లు ఇచ్చినా.. 20 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా.. జగన్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే.. ఇప్పటికిప్పుడు లక్ష కోట్ల వరకు నిధులు అవసరం అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. జగన్ తిరిగి అధికారంలోకి రావాలంటే.. వీటిని పూర్తి చేయకతప్పదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 28, 2021 10:42 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……