పారిశ్రామికవేత్తల్లో కొందరు కాస్త భిన్నం. ప్రపంచంలో తాము కోరుకున్నవన్ని తమకు అనుకూలంగా జరిగిపోవాలనుకుంటారు. అదే సమయంలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగాలని కోరుకోరు. అలాంటి వారిలో టెస్లా అధినేత ఒకరు. తన కార్లు అమ్ముకోవటానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్ను రాయితీ ఇవ్వాలి కానీ..ఆయన తన ప్లాంట్ ను మాత్రం భారత్ లో పెట్టుకోవటానికి మాత్రం ఆసక్తి చూపించరు. అలా అని తన ప్రయత్నాల్ని వదిలిపెట్టరు. ఏదోలా బద్నాం చేయాలని భావిస్తుంటారు. ఈ మధ్యన అలాంటి పనే చేసి వార్తల్లోకి వచ్చారు. భారత్ లో దిగుమతి పన్నులు ఎక్కువగాఉన్నాయని.. వాటిని తగ్గస్తే టెస్లా ఎస్ ప్లెయిడ్ కార్లను భారత్ లోకి తీసుకొస్తానని ప్రకటించాడు.
దీంతో భారత దేశంలో దిగుమతి సుంకం మీద చర్చ మొదలైంది. ఇలాంటి వేళ.. మోడీ సర్కారుకు చెందిన కీలక అధికారి ఒకరు చేసిన ప్రకటన ఎలన్ మస్క్ ను ఇరుక్కుపోయేలా చేసింది. తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా చూడొద్దన్నది టెస్లా కంపెనీ వాదన. అందుకే దిగుమతి పన్నులు తగ్గించాలన్న విన్నపాన్ని చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ కీలక అధికారి ఒకరు.. టెస్లా కోరినట్లుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే.. సదరు కార్ల కంపెనీ తయారీ యూనిట్ ను భారత్లో నెలకొల్పుతామంటే తమకు ఓకేనని పేర్కొంది.
ఈ రాయితీ టెస్లా ఒక్కదానికే కాదని.. భారత్ లో పరిశ్రమ నెలకొల్పే ఎవరికైనా ఇస్తామని పేర్కొంది. దీంతో టెస్లా ఇప్పుడు ఇరుకున పడినట్లైంది. ఎందుకంటే.. టెస్లా కంపెనీ అడిగిన రీతిలో రాయితీ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు.. యూనిట్ ను నెలకొల్పటానికి ఉన్న అడ్డంకి ఏమిటన్నది ప్రశ్నగా మారుతుంది. నిజానికి టెస్లా వ్యూహం వేరేనని చెబుతారు. ఆ కంపెనీకి అమెరికాలో కాకుండా జర్మనీ.. చైనాలో మాత్రమే కార్ల తయారీ యూనిట్ ను నెలకొల్పింది. ఈ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు చేపట్టాలన్నది దాని ప్లాన్.
అయితే.. రాయితీ అడగటం ద్వారా ప్రయోజనం పొందాలని భావించిన టెస్లాకు.. ఇప్పుడు కంపెనీ తయారీ యూనిట్ మీద కమిట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అది సాధ్యం కాదు కనుక.. ఎలాన్ మస్క్ నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక దిగుమతి చేసుకున్న పక్షంలో టెస్లా కారు ఎంత ధర పలుకుతుందన్న ప్రశ్నకు మార్కెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం కంపెనీ ధర రూ.కోటి ఉంటే.. ఇప్పుడు అమలు చేస్తున్న దిగుమతి సుంకాన్ని కలిపితే రూ.2 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇంత భారీ మొత్తానికి టెస్లా కారును కొనేవారు ఉండరన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 28, 2021 6:17 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…