తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు పెద్ద సంకటమే వచ్చి పడిందని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఉపపోరు.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తుండగా.. అదేసమయంలో సానుభూతి-సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఎటు మొగ్గు చూపాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. వరుస విజయాలతో దూసుకుపోతూ.. ఇక్కడి ప్రజలకు తలలోనాలుకగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి.. హుజూరాబాద్‌లో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈటల రాజేందర్ ఒకవైపు ఉన్నారు.
నిజానికి ప్రతి గడపకూ.. ఈటల సుపరిచితులు. ఆయనను కాదని… గడిచిన దశాబ్ద కాలంలో ఇక్కడ మరెవరికీ ప్రజలు పట్టం కట్టింది లేదు. ఆయనకు మంచి ఇమేజ్ కూడా ఉంది. పైగా.. పేదలు, మధ్య తరగతి వారికి కూడా ఆయన అందుబాటులో ఉన్నారనేది కూడా వాస్తవమే. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఆయన తన సతీమణితో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గం ప్రజల సమస్యలను పట్టించుకుని పరిష్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పైగా .. ఇప్పుడు ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ అన్యాయం చేశారనే ప్రచారాన్ని ఈటల వర్గం బాగానే ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లింది.
దీంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ ఈటలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ప్రతి ఒక్కరూ ఈటలకే జై కొట్టాలి. కానీ, అదేసమయంలో ప్రభుత్వం పరంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మంత్రాంగం పరంగా చూస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికీ చేయని సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ త్వరలోనే ప్రారంభించనున్నారు. ముఖ్యంగా దళిత బంధును ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు. రైతు బంధు పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయనున్నారు. అంటే.. ఇప్పటి వరకు జరిగిన సంక్షేమం ఒక ఎత్తయితే.. ఇక వచ్చే రెండు నెలల్లో అంటే.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే వరకు జరిగే సంక్షేమం మరో ఎత్తు.. దీనిని బట్టి ప్రభుత్వం వైపు మొగ్గుచూపాలా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రభుత్వాన్ని కాదని.. ఈటల వైపు మొగ్గు చూపితే.. సంక్షేమం నిలిచిపోయే అవకాశం ఉంది. పోనీ.. ఈటల ఏమైనా.. తర్వాత కాలంలో అభివృద్ధి చేయగలరా? అంటే.. ప్రబుత్వం ఇప్పటికే విపక్ష నేతలు ఉన్న నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. సో.. ఇప్పుడు ఎటు మొగ్గు చూపాలి. సానుభూతి వైపు మొగ్గు చూపకపోతే.. ఇన్నాళ్లు తనతో పనిచేయించుకుని.. ఇప్పుడు వదిలేశారనే అపప్రద ఈటల నుంచి ఎదురు కావడం ఖాయం. సో.. ఈ రెండు అంశాలపై హుజూరాబాద్ ప్రజలు మేధావులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 28, 2021 10:43 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…