విమర్శ కఠినంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలనుకునే నాయకత్వం తెరమరుగైపోయింది. విషయం ఏదైనా.. ఎప్పుడైనా పొగడాలే తప్పించి.. విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా భరించే పరిస్థితుల్లో నాయకత్వాలు ఉంటున్నాయి.
తాను విపక్ష నేతగా ఉన్న వేళలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టే వారికి తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడాయన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. విమర్శలు చేసినా వ్యవస్థల ద్వారా నోటీసులు ఇవ్వటం.. విచారణకు పిలవటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. మొన్ననే రంగనాయకమ్మ అనే పెద్ద వయస్కురాలు ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టిన వైనం.. ఆ తర్వాతేమైందో తెలిసిందే. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఉదంతం నేపథ్యంలో..రంగనాయకమ్మ తన ఆవేదనను తనకొచ్చిన ఫేస్ బుక్ పోస్టును తన పేజీలో పోస్టు చేశారు. అంతే.. ఆమె సీఐడీ నుంచి విచారణ నోటీసుల్ని ఎదుర్కొన్నారు.
మొన్ననే సీఐడీ అధికారులు రంగనాయకమ్మను విచారణకు పిలిచి ఏకంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. తనకు మరే ఉద్దేశాలు లేవని.. తన వరకు వచ్చిన అంశాన్ని పోస్టు మాత్రమే చేశానని రంగనాయకమ్మ చెబుతున్నారు. ఆమె ఉదంతం ఒక కొలిక్కి రాకముందే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూషకు సీఐడీనుంచి నోటీసులు అందాయి. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సింది.
27 ఏళ్ల అనూష.. జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని.. పాలనలో సాగుతన్న నిర్లక్ష్యాల్ని.. అలక్ష్యాన్ని పోస్టుల రూపంలో ప్రశ్నించటం ఆమెకు అలవాటు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కించిత్ వ్యతిరేకత కనిపించినా.. ప్రజల్లోకి వెళ్లి ప్రభావం చూపిస్తుందన్న సందేహం వస్తే చాలు వారిని ఆడా.. మగా అన్నది తేడా లేకుండా స్టేషన్ కు తీసుకొచ్చేస్తున్నారు. విచారణతో చుక్కలు చూపిస్తున్నారు.
ఆ కోవకు చెందినదే.. ఉండవల్లి అనూష (24)కు అలాంటి అనుభవమే తాజాగా ఎదురైంది. తరచూ జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించేలా వీడియోలు పెడుతున్నారని.. దీనికి సంబంధించిన వివరాల్ని మూడు రోజుల్లో వచ్చి చెప్పాలని.. లేనిపక్షంలో అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
ఏమైనా సోషల్ మీడియాలో స్వేచ్చను తనకున్న అధికారంతో అడ్డుకుంటున్నారన్న విమర్శలు జగన్ ప్రభుత్వం మీద రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వాటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి వినిపిస్తాయో?
This post was last modified on May 24, 2020 9:52 pm
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు…
మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన…
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…