రాష్ట్రంలో మూడు మాసాల కిందట మార్చి లో జరిగిన స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు ఫలితం వెలువడిన ఏలూరు కార్పొరేషన్‌లో కానీ.. అధికార పార్టీ వైసీపీ ఘన విజయం దక్కించుకుంది. నిజానికి అన్ని కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ పరిస్థితిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడూ జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న టీడీపీ బలీయంగా ఉన్నప్పటికీ.. ఇలా.. అన్ని కార్పొరేషన్లను (అప్పటి ఉన్న సంఖ్యను బట్టి) అధికార పార్టీ తన ఖాతాలో వేసుకున్న దాఖలా కనిపించలేదు.
అంతేకాదు.. ఇతర పక్షాలైన కమ్యూనిస్టులు.. సహా.. ప్రతిపక్షాలు కూడా ఆయా సమయాల్లో డివిజన్లలో సత్తా చాటిన పరిస్థితి కనిపించింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జరిగిన తొలిసారి స్థానిక ఎన్నికల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కానీ, పవన్ నేతృత్వంలోని జనసేన కానీ.. ఎక్కడా వైసీపీని నిలువరించలేక పోయారు. తమ ఓటు బ్యాంకుగా ఉన్న నగరాలను కూడా దక్కించుకోలేక పోయారు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. రెండు రీజన్లు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా చూసుకుంటే.. జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ ఒక ప్రధాన కారణమని అంటున్నారు.
ప్రతి నెలా 1వ తేదీనాడు.. తెలతెలవారుతూనే ఇంటికి వెళ్లి అందిస్తున్న పింఛన్లు ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయని.. అదే సమయంలో వలంటీర్ వ్యవస్థ, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా అమలు చేస్తున్న అమ్మ ఒడి, వాహన మిత్ర.. వైఎస్సార్ రైతు భరోసా వంటివి ప్రధానంగా.. వైసీపీ గెలుపునకు కారణాలుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. అదేసమయంలో మళ్లీ జగన్‌పై సానుభూతి పెరుగుతోందని అంటున్నారు. అదేంటి? అనే సందేహం వ్యక్తం కావొచ్చు. గత ఎన్నికలకు ముందు ఒక్కఛాన్స్ అంటే.. సానుభూతితో ఆయనను గెలిపించారని అనుకోవచ్చు.
కానీ, ఇప్పుడు కూడా జగన్‌కు సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వారు కోర్టులకు వెళ్లడం.. సదరు పనులు నిలిచిపోవడం వంటివి.. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. మరోవైపు వైసీపీ కూడా తాము పాలన చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని.. దీంతో ఏమీ చేయలేకపోతున్నామనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల వ్యవహారంపై ఉన్న కోపం.. వైసీపీకి సానుభూతిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
ఇక కరోనా కష్టకాలంలోనూ ప్రజల అక్కౌంట్లలోకి పడాల్సిన డబ్బులు అన్ని పడ్డాయి. దీంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా జగన్ చేయాల్సింది చేస్తున్నాడుగా అన్న సానుభూతి ప్రజల మనస్సుల్లోనే ఉంది. అందుకే వీరంతా స్థానిక ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ చేసేశారు. ఏదేమైనా రెండేళ్ల పాలనలో జగన్‌పై ప్రజల్లో విశ్వాసం అయితే పెరిగిందే కాని.. తగ్గలేదన్నది సుస్పష్టం..!
This post was last modified on July 27, 2021 1:53 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…