కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న ఆయనను రాజీనామా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. సీఎంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. ఈ రెండు సంవత్సరాలు తాను ఏనాడూ సంతోషంగా లేనని, ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. నాలుగోసారి సీఎంగా పదవి చేపట్టిన ఆయన ఏ ఒక్కసారి కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని ఆయన పూర్తి చేయలేకపోయారు. తన రెండెళ్ల పాలనపై యడ్యూరప్ప మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సాయంత్రమే బీజేపీ అధినాయకత్వం కొత్త సీఎం పేరును ఖరారు చేయనుంది.
కర్ణాటకలో కాంగ్రెస్-జెడీఎస్ కూటమి అధికారం చేపట్టిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ స్థానంలో యడ్యూరప్ప అధికారాన్ని చేపట్టారు.
కాగా.. యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా మురుగేష్ నిరాని, ప్రహ్లాజ్ జోషీ, అరవింద్ బళ్లాడ్ పేర్లు బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 26, 2021 2:34 pm
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…