Political News

బిగ్ బ్రేకింగ్ – ఎల్జీ పాలిమర్స్ సీజ్

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అమానవీయ ఘోరకలికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం శివారులోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అపార జంతు నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆ కంపెనీని సీజ్ చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కీలక తీర్పులో హైకోర్టు ఏం ఆదేశించిందంటే.. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని పేర్కొనడంతో పాుట ఇకపై కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. అంతేగాకుండా ఆ కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వెంటనే డైరెక్టర్లు తమంతట తాము పాస్ పోర్టులను కోర్టుకు స్వాధీన పరచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ తాజా ఆదేశాలతో కార్పరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొద్దిరోజులుగా ఈ కేసును హైకోర్టు విచారిస్తుండగా… కంపెనీ ప్రతినిధులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు విచారణ ఆపేలా ఆదేశాలివ్వాలని ఒక విచిత్రమైన పిటిషను వేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు వారి పిటిషను కొట్టేసి… హైకోర్టు, ఎన్జీటీలోనే తేల్చుకోవాలని తిప్పిపంపింది. తాజాగా హైకోర్టు కంపెనీ సీజ్ చేయడానికి ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వం తరఫున, ఎల్‌జీ పాలిమర్స్ తరపున హైకోర్టుకు వాదనలు విన్పించారు. ఈ సందర్భంగా ఇరువురికీ హైకోర్టు ఒక కీలక ప్రశ్న వేసింది. గ్యాస్ లీకేజీ తర్వాత స్టైరీన్‌ను ఇక్కడి నుంచి ఎవరి అనుమతితో తరలించారని కోర్టు ప్రశ్నించింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా… ప్రమాదం అనంతరం ఒక్క లీటరు స్టైరీన్ విశాఖలో ఉండటానికి వీల్లేదంటూ ప్రభుత్వం చెప్పడం, కంపెనీ స్టైరీన్ ను దేశం దాటించడం, మధ్యలో ఒకసారి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ స్టైరీన్ ఇంకా కొంచెం మిగిలి ఉంది అని కంపెనీ చెప్పిందని… తరలిస్తాం అని చెబితే తరలించుకోండి అని చెప్పామని స్వయంగా పేర్కొన్నారు. ప్రమాదం పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆనాడు స్టైరీన్ ను తరలించడానికి ఓకే చెప్పారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో స్టైరీన్ తరలింపుపై హైకోర్టు వేసిన ప్రశ్న… కొత్త ట్విస్ట్.

This post was last modified on May 24, 2020 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

5 minutes ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

8 minutes ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

11 minutes ago

ఆమె లేకుండా మంగళవారం – 2?

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…

1 hour ago

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

1 hour ago

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…

1 hour ago