తెలంగాణ లో హుజురాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకీ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నిక ల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ తరపున ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల తరపున అభ్యర్ధులు ఎవరన్న దానిపై మాత్రం సందిగ్థత కొనసాగుతోంది. ఈటలకు ధీటైన వ్యక్తిని హుజురాబాద్‌లో నిలబెట్టాల్సి వుంటుంది.
ఈ క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థిగా ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరును పరిశీలించి ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం వీణవంక మండలానికి ఆనుకుని ఉన్న అన్నారం గ్రామం. ఆయన స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ సునేరా టెక్నాలజీ దేశవిదేశాల్లో పలువురికి ఉపాధి కల్పిస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.
This post was last modified on July 24, 2021 10:36 am
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…
రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక…
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…