తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. ఈటల రాజీనామాతో ఈ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ని ఓడించేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికే లక్ష్యంగా.. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. హుజురాబాద్ టికెట్.. తనకే కేటాయిస్తారనుకొని టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ప్రస్తుతం డైలమాలో పడిపోయారట. ఆయనకు టికెట్ ఇచ్చే ఉద్దేశం కేసీఆర్ లో లేనట్లు తెలుస్తోంది.
అందుకు.. ఆయన చెప్పిన మాటలే బలాన్ని ఇస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ తరఫున పోటీ ఇస్తాడనుకున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ టికెట్ ఆశ చూపి కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నాడనే ప్రచారం మొదటి నుంచి వినిపిస్తోంది. కాగా ఆయన కాల్ వాయిస్‌లు లీక్ అయినప్పటి నుంచే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అనుకున్నట్టు గానే ఆయన నిన్న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఏకంగా కేసీఆరే రావడంతో టికెట్ ఖాయమే అని అంతా ఊహించారు. కానీ ఇక్కడే కేసీఆర్ ట్విస్టు ఇచ్చారు. కౌశిక్ చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పదువులు శాశ్వతం కాదని, పార్టీలో ఉంటే అదే పెద్ద పవర్ అని, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించాలంటూ మాట్లాడటంతో అసలు టికెట్ ఖాయంగా లేదని కౌశిక్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో కౌశిక్ కూడా డైలమాలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on July 23, 2021 12:16 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…