దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు.
అమెరికాలోని అధికార.. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు ‘‘ది హెచ్ 1బీ అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్’’ పేరుతో ఈ బిల్లును తయారు చేశారు. దాన్ని చట్టసభల్లో ప్రవేశ పెట్టారు. అంచనాలకు తగ్గట్లే ఈ బిల్లులో అమెరికాలో నివసిస్తున్న అమెరికన్లకు పెద్దపీట వేసేలా.. వారికి మరింత ప్రయోజనం కలిగించేలా ఈ బిల్లును ప్రతిసాదిస్తున్నారు.
అయితే.. కొంతలో కొంత మేలు చేసే అంశం ఏమంటే.. అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్ 1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
బిల్లులోని కీలకాంశాల్ని చూస్తే..
— అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్ 1బీ.. ఎల్ 1 వీసాదారులకు భర్తీ చేయటాన్ని పూర్తిగా నిషేధించాలి.
— వీసాదారులతో ఇతర అమెరికా ఉద్యోగులు.. కార్మికుల పనితీరు.. పని ప్రదేశంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలి.
— తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్1బీ.. ఎల్1 ఉద్యోగులను దిగుమతి చేసుకొని తిరిగి వారిని సొంతదేశానికి పంపే ఔట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలి
— 50 కంటే ఎక్కువమంది పని చేస్తూ వారిలో సగం కంటే ఎక్కువమంది హెచ్ 1బీ.. ఎల్ 1 వీసాదారులు ఉంటే.. మరింతమంది హెచ్ 1బీ వీసాదారుల్ని నియమించుకోవటాన్ని నిషేధించాలి
— ఉద్యోగ నియమకాలు.. వీసా రూల్స్ ను పక్కాగా పాటించేలా చూడటం కోసం లేబర్ డిపార్ట్ మెంట్ కు మరిన్ని అధికారాలు కట్టబెట్టటం
— నిబంధనల్ని ఉల్లంఘిస్తే లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులకు శిక్షల విధించే అధికారం కట్టబెట్టటం
This post was last modified on May 28, 2020 9:10 am
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…