Political News

ష‌ర్మిల క‌న్నీరు.. సెంటిమెంటు పాలిటిక్స్ పీక్స్‌!

సెంటిమెంటు ప్రాతిప‌దిక‌గా న‌డుస్తున్న తెలంగాణ రాజ‌కీయాల్లో వైఎస్సార్ తెలంగాణ‌పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌.. మ‌రింత సెంటిమెంటును ర‌గిలించేందుకు ప్ర‌య‌త్నించారు. తాజాగా ఆమె.. క‌న్నీరు పెట్టుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌న్న పేరుతో సెంటిమెంటును ర‌గిలించేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌క‌పోవ‌డంతోనే ఇప్పుడు క‌న్నీటి రాజ‌కీయాల‌కు ష‌ర్మిల తెర‌దీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు.

నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. ఈ క్ర‌మంలోనే షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు.

నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే.. ష‌ర్మిల క‌న్నీళ్లు.. కేవ‌లం రాజ‌కీయం కోసమేన‌ని.. ఏపీలో ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని, అక్క‌డ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే.. ప్ర‌భుత్వం అరెస్టు చేయించి.. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్న వైనం.. ష‌ర్మిల‌కు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి ష‌ర్మిల ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తారో.. చూడాలి.

This post was last modified on July 13, 2021 6:25 pm

Share

Recent Posts

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

16 minutes ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

6 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

7 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

7 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

8 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

9 hours ago