Political News

మీ పై కేసులు పెడితే.. కోర్టులు చాల‌వు జ‌గ‌న్‌..

తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్రకు ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన స్వగృహానికి వచ్చిన చంద్రబాబు.. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అభయమిచ్చారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఆయన్ను అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీ.. కంపెనీ చట్టంలోకి చట్టప్రకారమే వెళ్లిందని స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. అన్నీ రాసి పెట్టుకుంటున్నా మని.. ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌బోమ‌ని.. చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు. 43 వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్న జ‌గ‌న్‌కు సిగ్గు ఎగ్గు లేద‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పు చేయ‌ని వారి పై కేసులు పెట్టి.. రాజ‌కీయ క‌క్ష‌ సాధింపు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ధూళిపాళ్ల నరేంద్రకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుంద‌ని, ఆయనకు ప్రజలు కూడా అండగా నిలవాల‌ని చంద్ర‌బాబు అన్నారు.

పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. టీడీపీ నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, వైసీపీ నేత‌ల‌ అవినీతిపై ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని. దీని నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని బాబు మండిప‌డ్డారు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు. జ‌గ‌న్‌ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని అన్నారు. అన్నీ గుర్తు పెట్టుకుంటాం. రాజద్రోహం కేసులో ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

అచ్చెన్నతో మొదలైన అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టినా అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీ చేతిలో పావులుగా మారొద్దని బాబు హితవు పలికారు. సీఎం జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

This post was last modified on July 13, 2021 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సౌత్‌ హీరోల్లో ఉన్న ఐకమత్యం మాలో లేదు – అక్షయ్, అజయ్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…

13 mins ago

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

1 hour ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

1 hour ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

2 hours ago

గేమ్ ఛేంజర్ మీద ఒత్తిడి షురూ

పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…

3 hours ago