రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీ పొలిటికల్ జర్నీ క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. కర్నూలు జిల్లాలో చాలామంది సీనియర్ నేతలున్నప్పటికీ పరిస్ధితుల కారణంగా అఖిలప్రియను చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చిన్న వయసులోనే మంత్రయిపోవటంతో అఖిల రాజకీయ బ్యాలెన్సును కోల్పోయారు.
చిన్న వయసులోనే అఖిల మంత్రవ్వటానికి కారణం తల్లి, దండ్రులను కోల్పోయిన కాంపాషినేట్ గ్రౌండ్స్ లో మాత్రమే. అయితే ఆ విషయాన్ని మరచిపోయిన మాజీమంత్రి అందరితోను శతృత్వం పెంచుకున్నారు. ఎవరినిపడితే వాళ్ళని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో దగ్గరవాళ్ళే చివరకు దూరమైపోయారు. ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా వ్యవహరశైలిలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టేశాయి.
భర్త భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి దూకుడు స్వభావం అఖిల నోటిదురుసుకు తోడయ్యింది. ఇంకేముంది అగ్నికి ఆజ్యం తోడైనట్లే అయిపోయింది వ్యవహారం. ఈ కుటుంబంపై ఎక్కడ చూసినా కేసులే. అఖిల+భార్గవ్+జగత్ పై ధౌర్జన్యాలు, దొమ్మీలు, కిడ్నాపులు, సంతకాల పోర్జరీ, తప్పుడు సర్టిఫికేట్లు ఇలా ఒకటేమిటి వీళ్ళపై చాలా కేసులే నమోదయ్యాయి. దగ్గర బంధువులే వీళ్ళపై అనేక కేసులు పెట్టారు. పార్టీలో వీళ్ళకు మద్దతుగా ఎవరు లేనట్లే.
నిజానికి అఖిల వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగానే తయారైంది. అందుకనే అఖిలతో నేతల్లో చాలామంది మాట్లాడటమే మానేశారట. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టాలన్నా అనుమతి నిరాకరించినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అఖిలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీలో అఖిల కత క్లైమ్యాక్సికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. కాకపోతే బయటకు పంపేయటానికి ముహూర్తం ఒక్కటే ఖరారు కాలేదు.
This post was last modified on July 11, 2021 9:49 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…