తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఏడేళ్లుగా ఎంతో మందిని నయానో… భయానో పార్టీలో చేర్చేసుకుంటోంది. పదవులు కావాలన్న వారికి పదవులు… కాంట్రాక్టులు కావాలన్న వారికి కాంట్రాక్టులు.. లొంగని వారిపై అనేక ఒత్తిళ్లు.. పార్టీ కండువా కప్పడానికి టీఆర్ఎస్ ఇవే ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. పార్టీలోకి వచ్చాక కొద్ది నెలల పాటు వీరిని అందలం ఎక్కించడం.. ఆ తర్వాత క్రమక్రమంగా పక్కన పెట్టేయడం కూడా గులాబీ పార్టీలో కామన్ అయిపోయింది. జూనియర్ల నుంచి తలపండిన రాజకీయ నేతల వరకు ఎంతో మంది ఇప్పుడు తమ బాధ ఎవ్వరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న సీనియర్లు ఇప్పుడు కనీసం తమ గ్రామస్థాయిలో కూడా చక్రం తిప్పలేక చతికిలపడుతున్నారు.
టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన వారిలో తుమ్మల, కడియం, పొంగులేటి, జూపల్లి ఉన్నారు. కానీ ఇప్పుడు వారు కనీసం వార్తల్లో కూడా ఉండడం లేదు. అసలు పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? ఏం చేయాలన్న సమాలోచనల్లో ఉన్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందే బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే అప్పుడు వీరిద్దరి అసంతృప్తిని పసిగట్టిన కేసీఆర్ వీరికి కొన్ని హామీలు ఇచ్చి సైలెంట్ చేశారు.
అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వపు రోజులు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్‌లో పాత జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ దూకుడుతో నిన్నటి వరకు తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్లిన బీజేపీ సైతం ఇప్పుడు డైలమాలో పడింది. బీజేపీలోకి వెళ్లాలనుకుంటోన్న వారు, టీఆర్ఎస్ అసంతృప్త వాదులు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక పై లిస్టులో ఉన్న కారు పార్టీ అసంతృప్త నేతలు కూడా ఇప్పుడు కాచుకుని ఉన్నారట. త్వరలోనే తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి.
వీటిల్లో తమకు ఛాన్స్ వస్తే సరి.. లేకపోతే ఈ ఎమ్మెల్సీల ప్రకటన తర్వాత ఈ నేతలంతా తమదారి తాము చూసుకునేందుకు రెడీగానే ఉన్నారట. వీరు మాత్రమే కాదు.. రాష్ట్రం వ్యాప్తంగా ఇదే పరిస్థితుల్లో ఉన్న కారు పార్టీ నేతలు ఇప్పుడు టైం కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. రెడ్డి వర్గంలో మెజార్టీ నేతలు మాత్రం కేసీఆర్‌కు షాక్ ఇవ్వడం ఖాయమే ?
This post was last modified on July 7, 2021 12:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…