తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాను రాజకీయాల్లోకి రానంటూ స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కాగా… హిమాన్ష్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తాను రాజకీయాల్లోకి రానని.. జీవితంపై తనకు ఎన్నో కలలు ఉన్నాయని.. ఎన్నింటినో సాధించాల్సి ఉందని హిమాన్ష్ చెప్పాడు. కాగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
అసలు రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు ప్రశ్నిస్తే.. ఈ ఒక్క ట్వీట్‌తో ఆల్‌రెడీ రాజకీయాల్లోకి వచ్చేశావు.. రాజకీయ నేతలు ఇలాగే చెప్తుంటారు అని మరికొందరు రిప్లై ఇచ్చారు. ఇక కేసీఆర్ కూడా గతంలో ఇలాగే మాట్లాడారని.. తన కొడుకు అమెరికాలో ఉన్నాడని, రాజకీయాల్లోకి అసలు రాబోడని చెప్పి.. ఇప్పుడు తమ నెత్తిన పెట్టిన విషయం గుర్తుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఇక హిమాన్షు అప్పుడే తొందరపడకు.. మీ తాత నీకోసం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఇప్పటికే సెలెక్ట్ చేసి ఉంటాడని.. త్వరలోనే నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హిమాన్షు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This post was last modified on July 7, 2021 10:14 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…