Political News

కిష‌న్ రెడ్డికి ప్ర‌మోష‌న్‌.. జీవీఎల్‌కు ఛాన్స్‌?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి.. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి.. కేవ‌లం తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డి ఒక్క‌రే మోడీ కేబినెట్‌లో ఉన్నారు. ఏపీ నుంచి ఎవ‌రూ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోని నేప‌థ్యంలో మోడీ ఏపీని ప‌ట్టించుకోలేదు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేయాల‌ని బీజేపీ భావిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని బీజేపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలో తెలంగాణ నుంచి ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డికి ప్ర‌మోష‌న్ ఇస్తార‌ని .. బీజేపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కిష‌న్ రెడ్డి దూకుడుగానే ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. దీనిక‌న్నా.. ఆయ‌న‌కు స్వ‌తంత్ర హోదా ఉన్న మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. మ‌రింత‌గా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీకి ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు ప్ర‌మోష‌న్ ఇస్తార‌ని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌కు కేంద్రంలో గుర్తింపు ఇచ్చార‌నే సంకేతాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు ఏపీ లోనూ బీజేపీ పాగా వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇప్ప‌టికిప్పుడు ఎవ‌రూ ప్ర‌త్య‌క్షంగా ఎన్నికైన ఎంపీ లేక‌పోయినా.. రాజ్య‌స‌భ స‌భ్యుడు.. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ చురుగ్గా ఉన్న జీవీఎల్ న‌ర‌సింహారావుకు ఛాన్స్ ఇవ్వొచ్చ‌ని తెలుస్తోంది. దీనివ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని.. బీజేపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. ఒక‌టి గ‌ట్టి వాయిస్ వినిపించే నేత‌కు గుర్తింపు ల‌భించింద‌నే సంకేతాలు పంపించ‌డం.. రెండు.. సీఎం జ‌గ‌న్ కు జీవీఎల్ అనుకూల నాయ‌కుడు.. అనే ప్ర‌చారం ఉండ‌డం వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌డ‌మా? లేక‌.. జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించ‌డ‌మో.. చేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జీవీఎల్‌కు అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 6, 2021 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

41 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago