దేశీయంగా తయారు చేసిన కొవాగ్జిన్.. కోవీషీల్డ్ లకు సంబంధించి కొన్ని దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకాలం ఎంతలా చెప్పినా మాట వినని దేశాలకు.. తనదైన శైలిలో సమాధానం చెప్పటం షురూ చేసింది. కొవిడ్ 19కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో భారత్ లో రూపొందించిన సీరం వారి కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాల్ని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ టీకా కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ టీకాలు వేయించుకున్న వారు యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భారత్ కు చెందిన రెండు టీకాల్ని గుర్తించేందుకు ఈయూ ససేమిరా అంటోంది. దీనికి సంబంధించిన వివరాల్నిఇప్పటికే ఆయా దేశాలతో భారత్ చెప్పినా.. మాట వినని పరిస్థితి. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు అర్థమయ్యే మాటను భారత్ చెప్పటం షురూ చేసింది.
తమ టీకాలను యూరోపియన్ దేశాలు గుర్తించని పక్షంలో.. వారి దేశస్తులు భారత్ కు వస్తే వారిని తాము కూడా గుర్తించమని స్పష్టం చేసింది. యూరోపియన్ దేశాల గ్రీన్ పాస్ స్కీంలో భారత్ టీకాలకు చోటు కల్పించని పక్షంలో.. తాము కూడా ఈయూ దేశాలకు చెందిన వారు భారత్ కు వస్తే.. వారి వ్యాక్సిన్లను తాము గుర్తించమని స్పష్టం చేశారు. అదే జరిగితే.. ఆయా దేశాల వారు భారత్ కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది. మరి.. ఇప్పటికైనా ఈయూ దేశాల తీరు మారుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 1, 2021 5:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…