కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే సరిపోయింది.
ప్రపంచం గురించి పట్టించుకోవడం మానేశాం. ఇండియాలోనే ఇప్పుడు ఏకంగా లక్షా 12 వేల కేసులు, 3500 దాకా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది.. ఎన్ని కేసులు నమోదయ్యాయి.. మరణాలు ఎన్ని ఏ దేశంలో పరిస్థితి ఏంటి? ఒకసారి పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏకంగా అరకోటికి చేరడం గమనార్హం. అందులో అత్యధికంగా 15 లక్షల మందికి పైగా బాధితులున్నది ఒక్క అమెరికాలోనే. వరల్డ్ వైడ్ మొత్తం కరోనా మరణాలు 3 లక్షల 26 వేలు కాగా.. అమెరికాలో మాత్రమే 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఓవరాల్‌గా నంబర్ పెద్దదైనా అమెరికాలో ఇప్పుడు కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చినట్లే అంటున్నారు. ఇంతకుముందు కరోనా విలయ తాండవం చేసిన యూరప్ దేశాలు ఇటలీ, స్పెయిన్‌ల్లోనూ పరిస్థితి మెరుగైంది. ఐతే ఇప్పుడు కరోనా ధాటికి ఎక్కువగా బాధ పడుతున్నది బ్రెజిల్, రష్యా దేశాలే.
అక్కడ రోజూ వందల్లో కరోనా మరనాలు సంభవిస్తున్నాయి. బ్రెజిల్‌లో ఒక్క రోజులో 1200 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. రష్యాలో సైతం కొన్ని రోజులుగా ప్రతి దినం 500కు తక్కువ కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్ ఇప్పటికీ చాలా మెరుగనే అంటున్నారు. ఐతే బుధవారం దేశవ్యాప్తంగా ఏకంగా 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటిదాకా రికార్డు.
This post was last modified on May 21, 2020 1:35 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…