రాజకీయంగా కేసీయార్ కు కష్టాలు మొదలైనట్లే అనిపిస్తోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా రాజకీయంగా ఏకకాలంలో ఇద్దరు గట్టి ప్రత్యర్ధులను ఎదుర్కోవటం మాత్రం కేసీయార్ కు ఇబ్బందనే చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రూపంలో గట్టి ప్రత్యర్ధి నిలబడ్డారు. తాజాగా పీసీసీ అధ్యక్షుని నియామకంతో రేవంత్ రెడ్డి కూడా మరోవైపు కేసీయార్ ను చెడుగుడు ఆడుకోవటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కేసీయార్ పై ఒంటికాలిపై లేచే రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పీఠం దక్కటమంటే చిన్న విషయం కాదు.
కేసీయార్ ను రాజకీయంగా ఎదుర్కోవటంలో బీజేపీ నేతల్లో చాలామందికి చేతకాదనే చెప్పాలి. ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కేసీయార్ ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది వాస్తవమే. ప్రత్యర్ధులను దూషించటంలోకానీ లేదా విమర్శలతో విరుచుకుపడటంలో కానీ కేసీయార్ స్టైలే వేరు. కేసీయార్ స్టైల్లోనే కేసీయార్ కు గట్టిగా సమాధానం చెప్పేస్ధాయి కమలనాదుల్లో ఎవరికీ లేకుండాపోయింది. అందుకే బీజేపీ గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఇలాంటి సమయంలో హఠాత్తుగా బండిసంజయ్ అధ్యక్షుడయ్యారు. బండి పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి మంచి దూకుడు మీదున్నారు. కేసీయార్ ఒకటంటే ఆయన రెండంటున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బండి దూకుడు ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. అన్నీ వేళలా దూకుడుమంత్రం పనిచేయకపోవచ్చు. కానీ పార్టీలో, జనాల్లో కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధి దొరికాడని అనుకోవటంతో మాత్రం బండి సక్సెస్ అయ్యారు.
బండి సంగతి పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ లో కేసీయార్ ను ధీటుగా ఎదుర్కుంటున్నది రేవంత్ మాత్రమే అని అందరికీ తెలిసిందే. చెప్పుకోవటానికి చాలామంది సీనియర్లున్నా కేసీయార్ ను ఎదుర్కోవటంలో ఎవరూ పనికిరారు. పైగా ఉన్న సీనియర్లలో చాలామంది కేసీయార్ కోవర్టులే అనే ఆరోపణలున్నాయి. వీళ్ళందరినీ కాదని రేవంత్ మాత్రమే కేసీయార్ పై నిఖార్సయిన ఫైట్ ఇస్తున్నారు. ఇలాంటి రేవంత్ కు అధిష్ఠానం పీసీసీ పగ్గాలు అప్పగించింది.
అంటే ఒకవైపు బండి సంజయ్, మరోవైపు కేవంత్ టీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ కు పక్కలో బల్లాలుగా తయారవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. ఇద్దరిదీ దూకుడు స్వభావమే. కేసీయార్ రెండు మాటలంటే వీళ్ళద్దిరు కూడా నాలుగు వీలైతే పదిమాటలు అనేవాళ్ళే. పైగా పార్టీ క్యాడర్ తో పాటు జనాల్లో జోష్ నింపేవాళ్ళనటంలో సందేహంలేదు. సరిగ్గా హుజరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ముందు రేవంత్ నియామకం జరగటంతో ఫైట్ మంచి పట్టుమీదుంటుందనే అనుకోవాలి. మొత్తంమీద ఇద్దరు గట్టి ప్రత్యర్ధులతో కేసీయార్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలైందనే ప్రచారం మొదలైపోయింది.
This post was last modified on June 28, 2021 10:57 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…