మొత్తానికి అనుకున్నది అదికూడా చాలా స్పీడుగా రేవంత్ రెడ్డి సాధించారు. రేవంత్ ను తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీనియర్ల నుండి ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ వాటిని కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపటం ఆశ్చర్యంగా ఉంది. అయితే రేవంత్ కు పీసీసీ పీఠ దక్కటం అంత సులువుగా మాత్రం సాధ్యంకాలేదు.
తొందరలోనే సాధారణ ఎన్నికలున్న కారణంగా కేసీయార్ పై గట్టిగా పోరాటం చేయగలిగిన నేత రేవంత్ మాత్రమే అని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. నిజానికి పీసీసీ పీఠం అందుకునేందుకు కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్లు చాలామందున్నారు. కానీ వారిలో సమర్ధులు లేరనే చెప్పాలి. సమర్ధతత అంటే పదిమందిని కూడగట్టుకోవటం, వందమందిని ప్రభావితం చేయగలగటం, కేసీయార్ పై నిఖార్సయిన పోరాటం చేయటం లాంటి అంశాల్లో రేవంత్ మాత్రమే అందరికన్నా ముందున్నారని సమాచారం.
టీడీపీలో ఉన్నప్పటినుండి కేసీయార్ పై రేవంత్ గట్టిపోరాటాలే చేస్తున్నారు. ఓటుకునోటు కేసులో పట్టుబడి అరెస్టయిన తర్వాత ఆ పోరాటం ఇంకా ఎక్కువైంది. అయితే టీడీపీలో నుండి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన పోరాటానికి మరింత పదునుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కేసీయార్ పై గట్టి పోరాటం చేస్తున్నదెవరంటే రేవంత్ అని మాత్రమే జనాలు అనకునేంతగా రేవంత్ ఎదిగిపోయారు.
ఇపుడున్న కాంగ్రెస్ నేతల్లో చాలామంది కేసీయార్ కోవర్టులే అన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. పట్టుమని తెలంగాణాలో నాలుగురోజులు కూడా వరసగా పర్యటనలు చేసి పది సభల్లో మాట్లాడలేని నేతలు కూడా పీసీసీ పీఠాన్ని ఆశించనవారే. గడచిన దుబ్బాక, గ్రేటర్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో రేవంత్ కష్టపడినట్లు ఇకెవరు కష్టపడలేదన్నది వాస్తవం. నేతలందరి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత కేసీయార్ పై నిఖార్సయిన పోరాటం చేయగలిగింది ఎవరనే నిర్ధారణకు రావటంతోనే రేవంత్ కు పీసీసీ అద్యక్ష పదవిని కట్టబెట్టినట్లు సమాచారం. మరి రేవంత్ ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on June 27, 2021 2:24 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…