మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గడచిన ఏడాదిన్నరగా యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న విషయం తెలిసిందే. చాలా దేశాల్లో లక్షలమంది చనిపోయారు. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందలైపోయింది. కరోనా వైరస్ దెబ్బకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. చాలా దేశాల్లో ఎన్నెన్నో జరిగిపోతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్కటంటే కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట.
ఈ విషయాన్ని ఎవరో చెప్పటం కాదు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధే (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అంటే డబ్ల్యూహెచ్ఓకు ఉత్తరకొరియా ఇచ్చిన నివేదికే ఆధారం లేండి. ఎందుకంటే ఆ దేశంలోకి మరేతిర దేశాలను అనుమతించరు కదా. దేశాధ్యక్షుడు, నియంత కిమ్ అనుమతి లేకుండా ఎవరు దేశంలోకి వచ్చేందుకు లేదు దేశం విడిచి వెళ్ళేందుకు లేదు.
ఇలాంటి దేశానికి సంబంధించిన ఏ సమాచారమైనా దేశాధ్యక్షుడు ఆదేశాల ప్రకారం తయారవ్వాల్సిందే. అందుకనే తాజా రిపోర్టు ప్రకారం ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కేసులు నిల్ అట. అదేమిటి చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న దేశం, చైనా దిగుమతుల మీదే ఆధారపడ్డ దేశం కదా ఉత్తరకొరియా మరలాంటపుడు కరోనా కేసులు లేకపోవటం ఏమిటి ? అని ఎంతమందికి ఎన్ని డౌట్లున్నా రిపోర్టును చదువుకోవటం మినహా చేయగలిగేదేమీ లేదు.
జూన్ 4-10 తేదీల మధ్య 733 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 149 మందిలో ఇన్ ఫ్లుయెంజా, శ్వాశకోశ సమస్యలు బయటపడ్డాయే కానీ కరోనా లక్షణాలే కనబడలేదట. నిజానికి చైనా-ఉత్తరకొరియా మధ్య రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కరోనాకు చైనానే పుట్టిల్లని మొత్తం ప్రపంచం నమ్ముతోంది. ఇలాంటి సమయంలో చైనా నుండి ఉత్తరకొరియాలోకి కరోనా వైరస్ కేసులు చొరబడలేదంటే ప్రపంచంలో ఎవరు నమ్మటం లేదు. కానీ చేయగలిగేది ఏముంది ?
This post was last modified on June 23, 2021 3:48 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…