రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని.. కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఏపీ సర్కారు మీద కేసీఆర్ బండలు వేయటం కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ వాదనను సమర్థంగా వినిపించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల చిట్టాను వరుస పెట్టి చదివారు.
ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవటానికి ఈ ప్రాజెక్టులు అంటూ ఏపీ వైఖరిని స్పష్టం చేసిన అనిల్.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరును తప్పు పట్టారు. “ఢిల్లీలో వారు ధర్నాలు చేస్తే చేయనివ్వండి. ఏపీ తన వాదనతో ముందుకు వెళుతుంది. అపెక్సు కౌన్సిల్ లోనే పోరాడతాం. మాకు కేటాయించిన నీటిని వాడుకుంటే అది ఎందుకు తప్పు అవుతుంది. నిబంధనల మేరకే పథకాల్ని చేపట్టాం. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకునేందుకే ఈ ప్రాజెక్టులు” అంటూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పిన మంత్రి.. వాటి వివరాల్ని వెల్లడించారు. “పాలమూరు – రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కన్నా దిగువ నుంచే నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. కల్వకుర్తి.. భీమా.. నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని తెలంగాణ పెంచుతోంది. రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడే ఉన్నాయి. ఏదీ కొత్త ప్రాజెక్టు కాదు” అని చెప్పారు. సుంకేశుల బ్యారేజి జల విస్తరణ ప్రాంతం నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని.. ఇది అక్రమ ప్రాజెక్టు కాదా? దానికి ఏం అనుమతులు ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. మంచితనం బలహీనత కాదంటూ ఏపీ వైఖరిని సూటిగా చెప్పేశారు మంత్రి అనిల్.
This post was last modified on June 22, 2021 11:26 am
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…