కర్నాకటలో అసమ్మతి నేతలు రూటు మార్చినట్లున్నారు. యడ్యూరప్పను సీఎం పదవిలో నుండి తొలగించే విషయంలో అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీ నుండి అరుణ్ సింగ్ అనే దూతను అగ్రనేతలు పంపిన విషయం తెలిసిందే. ఎలాగైనా యడ్డీని పదవిలో నుండి దింపేయాలనే ఉద్దేశ్యంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవుతున్న విషయం తెలిసిందే.
అరుణ్ తో భేటీ అయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు యడ్డీ విషయమై తమ అభిప్రాయాలను స్పష్టంగానే చెప్పారు. అయితే అభిప్రాయసేకరణ తర్వాత యడ్డీనే పదవిలో కంటిన్యు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో యడ్డీ వ్యతిరేకులంతా తమ రూటును మార్చుకున్నట్లు అనిపిస్తోంది.
సీఎంను వదిలేసి ఆయన కొడుకు విజయేంద్రపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. బీజేపీ ఎంఎల్సీ హెచ్ విశ్వనాద్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కొడుకు విజయేంద్ర జోక్యం చేసుకుంటున్నట్లు తీవ్రమైన ఆరోపణలుచేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఆర్ధికశాఖ అనుమతి లేకున్నారు. 21,473 కోట్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
విజయేంద్ర జోక్యం కారణంగానే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచినట్లు బహిరంగంగా ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకైన విజయేంద్ర ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు పిలిచేట్లు చేశారన్నారు. అలాగే జిందాల్ ఉక్కు కర్మాగారం విస్తరణ కోసం 3667 హెక్టార్ల భూమిని అత్యంత తక్కువ ధరకే అమ్మాలనే నిర్ణయం వెనుక కూడా విజయేంద్రే ఉన్నట్లు మండిపడ్డారు.
కాంగ్రెస్, జేడీఎస్ తో విజయేంద్ర కుమ్మకైన కారణంగానే పై పార్టీలు కూడా ప్రభుత్వంలో అవినీతిపై నోరెత్తటం లేదన్నారు. సరే విశ్వనాధ్ ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఆరోపణలు చేయటం విశ్వనాధ్ కు మామూలైపోయిందంటు యడ్డీ ధ్వజమెత్తారు. మొత్తానికి యడ్డీ వ్యతిరేకుల తీరు చూస్తుంటే రూటు మార్చుకుని కొడుకు విజయేంద్రను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.
This post was last modified on June 19, 2021 8:12 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…