మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చాలా చిన్న వయస్సులోనూ ఊహించని విధంగా అనేకానేక పెద్ద పదవులు దక్కించుకున్నారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే, తండ్రి మరణంతో మంత్రి అయ్యారు. చిన్న వయస్సులోనే మంత్రి పదవి దక్కించుకున్న ఆమెకు రావాల్సినంత పేరు రాలేదు. అదే సమయంలో ఆమె రెండో భర్తగా భార్గవ్‌రామ్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా ఘోరంగా ఓడిపోవడానికి మాత్రం ప్రధాన కారణం భార్గవ్‌రామే. అఖిలప్రియ పేరుకు మాత్రమే టీడీపీలో ఉన్నారే తప్పా ఆమె బంధువులు అందరూ వైసీపీలోనే ఉన్నారు. ఆమె సోదరుడు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి సొంత మామ కాటసాని రామిరెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యే.
ఇక ఆమె సొంత మేనమామ ఎస్వీ. మోహన్‌రెడ్డి వైసీపీలో కీలకంగా ఉండడంతో పాటు కర్నూలు రాజకీయాలను శాసిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలో అఖిల బంధువులు అందరూ వైసీపీలోనే ఉన్నారు. పైగా వైఎస్ ఫ్యామిలీతో వీరికి బంధుత్వం కూడా ఉంది. అఖిల తొలి భర్త జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖిల వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ తల్లి విజయలక్ష్మి అఖిల దాంపత్య జీవితాన్ని నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలే చేశారని అంటారు.
అదంతా గతం.. కట్ చేస్తే అఖిలపై కొద్ది రోజుల క్రితమే కేసులు నమోదు అయ్యాయి. ఆమె భర్త భార్గవ్ చివరకు పరారీలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె కొంత కాలంగా సైలెంట్‌గానే ఉన్నారు. పైగా నంద్యాల డెయిరీ కూడా భూమా ఫ్యామిలీ నుంచి చేజారింది. ఆమెకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు. మరోవైపు సోదరి మౌనికతోనే ఆర్థిక విబేధాలు బయటకు పొడచూపాయి. హైదరాబాద్‌లో కబ్జా కేసుల్లో ఇరుక్కుని ఆమె అక్కడ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఏదేమైనా ఆమె పట్టు రాజకీయంగా కూడా సడలిపోతోంది. అటు ఆమె ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ వాళ్లు కూడా పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే అఖిలను వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. ఆమె మేనమామ మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందే తిరిగి వైసీపీలోకి వెళ్లారు. తన అక్క, బావ లేకపోవడం, అటు తన మేనకోడలు ఇబ్బందుల్లో ఉండడంతో ఆయన అఖిలను తిరిగి వైసీపీలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలోనే అఖిల వైఎస్. విజయలక్ష్మి ద్వారా తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగన్‌కు చెప్పించుకుందని ఆమె బంధువులే బయట ప్రచారం చేశారు. మరి ఇన్ని కష్టాల్లో ఉన్న అఖిల పోరాటం చేసి టీడీపీలోనే నిలబడుతుందా ? లేదా వైసీపీ చెంత చేరిపోతుందా ? అన్నది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on June 17, 2021 6:25 pm
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…
వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ…