Political News

రోడ్డున పడిన అబ్బాయ్

బీహార్లో లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అద్యక్షుడు చిరాగా పాశ్వాన్ కే పార్టీ ఎంపిలు పెద్ద షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ అద్యక్షుడిగా చిరాగ్ ను తప్పించిన ఎంపిలు తాజాగా పార్టీ అధ్యక్షునిగానే తీసి పడేశారు. చిరాగ్ కు ఎల్జేపీకి సంబంధమే లేదని ఎంపిలు కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేశారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఛైర్మన్ గా చిరాగ్ ను తొలగించారు. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చిన అబ్బాయ్ ను పశుపతి తనింట్లోకి కూడా రానీయలేదు. చాలాసేపు రోడ్డుమీదే వెయిట్ చేసి చేసేది లేక వెళ్ళిపోయారు.

రెండు రోజుల క్రితం ఎల్జేపీని చీల్చేసిన సొంత బాబాయ్ పశుపతి కుమార్ పరాశర్ చిరాగ్ కు వ్యతిరేకంగా చాలా స్పీడుగా పావులు కదుపుతున్నారు. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత అబ్బాయ్-బాబాయ్ మధ్య మొదలైన గొడవలే చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పాశ్వాన్ మరణించిన తర్వాత ఓ సమావేశంలో బాబాయ్ తో చిరాగ్ మాట్లాడుతు ‘నువ్వసలు నాకు బాబాయ్ వే కాదు నీకు నాకు రక్త సంబంధమే లేదు’ అని అవమానకరంగా మాట్లాడారట. నిజానికి అప్పటివరకు అన్న పాశ్వాన్ తరపున రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ పశుపతే చూసుకునేవారట. చిరాగ్ చేతికి పార్టీపగ్గాలు అందిన తర్వాతే పశుపతికి అవమానాలు మొదలైనట్లు సమాచారం. అలాంటి ఘటనలు పెరిగిపోయి చివరకు పార్టీ చీలికకు దారితీసింది.

మొత్తానికి కారణం ఏదైనా పార్టీ రెండుగా చీలిపోయిందన్నది వాస్తవం. బాబాయ్ తో సయోధ్య చేసుకునేందుకు చిరాగ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. బాబాయ్ తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చిన అబ్బాయ్ ను ఇంట్లోకి అనుమతించలేదు. దాంతో గంటసేపు రోడ్డుపైనే వెయిట్ చేసిన చిరాగ్ చివరకు వెళ్ళిపోయారు. మొత్తానికి బాబాయ్-అబ్బాయ్ మద్య మొదలైన వ్యక్తి వివాదం కారణంగా పార్టీ చీలిపోవటమే కాకుండా చిరాగ్ ను రోడ్డున పడేట్లు చేసింది.

This post was last modified on June 16, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలీవుడ్ బేబీకి హీరో దొరికాడు

ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…

4 mins ago

జగన్ లంచం తీసుకొని ఉంటే శిక్షించాలి: కేటీఆర్

అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago

షర్మిల కామెంట్లపై బాలయ్య ఫస్ట్ రియాక్షన్

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…

9 hours ago

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

11 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

14 hours ago