బెంగాలీ నటి, టీఎంసీ నుస్రత్.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సాధారణంగా రాజకీయ నాయకులు వార్తల్లోకి ఎక్కారంటే ఏదైనా పొలిటికల్ ఇష్యూ అయ్యి ఉంటుంది. అయితే.. నుస్రత్ జహాన్ మాత్రం.. తన పెళ్లి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన రూమర్స్ తో వార్తల్లోకి ఎక్కారు.
గత కొద్దిరోజులుగా… నుస్రత్ గర్భం దాల్చారంటూ వస్తున్నారు. మరో వైపు ఆమె భర్తతో కలిసి ఉండటం లేదంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా.. వాటిపై ఆమె స్పందించారు. తాను తన భర్త నుంచి విడిపోయానని స్పష్టం చేశారు.
అసలు నిఖిల్ తో తన పెళ్లి టర్కిష్ చట్టం ప్రకారం జరిగింది.. అది ఇండియాలో చెల్లదని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఖిల్ జైన్పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను నిఖిల్ అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని నిధులను దుర్వినియోగం చేశారన్నారు.
ఇదిలా ఉండగా.. నుస్రత్ గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. నుస్రత్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తనకు ఎటువంటి సంబంధంలేదని నిఖిల్ నేషనల్ మీడియాతో చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. పెళ్లి బంధం తెంచుకున్నట్లు ప్రకటించిన ఆమె.. తన ప్రగ్నెన్సీ గురించి మాత్రం నోరు విప్పలేదు.
కాగా.. నుస్రత్..నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను జూన్ 19,2019న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బెంగాల్లో టీఎంసీ తరపున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దాంతో అటు పెళ్లి, ఆ వెంటనే రాజకీయ అరంగేట్రం అన్నీ ఆమెకు కలిసి వస్తున్నాయనుకున్నారు. ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.
This post was last modified on June 9, 2021 5:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…