కన్నడిగులకు మరో అవమానం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ విషయంలో కన్నడిగులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. వారికి ఇతర భాషల వాళ్లు కూడా వారికి మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్‌కు లీగల్ నోటీసు కూడా జారీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం దిగి వచ్చి.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పింది. ఈ వివాదాన్ని మరచిపోకముందే కన్నడిగలకు మరో అవమానం జరిగింది…
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కెనడాలో అమ్ముతోన్న బికినీలపై కర్ణాటక రాష్ట్ర జెండాతో ముద్రించడం వివాదాస్పదమైంది. పసుపు-ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్ వెబ్‌సైట్, యాప్‌లో విక్రయిస్తున్నారు. సదరు ప్రాడక్ట్ ను కన్నడ జెండా బికినీగానే అమెజాన్ పేర్కొనడం గమనార్హం.
ఈ వ్యవహారంపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబాలి తప్పుపట్టారు. మొన్న గూగుల్, ఇవాళ అమెజాన్.. ఇంకా ఎంత కాలం తమ భాష, సంస్కృతి, జెండాను అవమానిస్తారంటూ ఫైరయ్యారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసినందుకు అమెజాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.
కాగా, నిజానికి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా అంటూ ఏదీ లేదు, అయితే, కన్నడ సాంస్కృతిక చిహ్నంగా రూపొందిన జెండాను కన్నడిగులు, ఆ భాష, సాంస్కృతిక ప్రేమికులు వాడుతుంటారు. దానికి గుర్తింపు కల్పించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినా, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
This post was last modified on June 7, 2021 9:04 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…