“మా రాజా వారు మాకే ద్రోహం చేస్తున్నారు” -“పేరుకు మాత్రమే మా నాయకుడు.. ఆయన మాకు ఏం చేశారని!”..ఇవీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గం సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు. గత ఎన్నికల్లో ఇదే రాజా వారికి ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం జ్యోతలు పట్టింది. ఆయన చెప్పిన వారికే ఓట్లు వేసి గెలిపించారు కూడా. అయితే.. కేవలం రెండేళ్లలోనే ఇంతగా వాయిస్ మారిపోవడానికి రీజనేంటి? అనేది ఆశ్చర్యంగా మారింది.
ఇంతకీ.. రాజా అంటే.. జక్కంపూడి రాజా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఈయనకు సీఎం జగన్ వద్ద నేరుగా వెళ్లి మాట్లాడే చనువు ఉంది. ఈ చనువుతోనే ఆయనకు జగన్.. కాపు కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. వాస్తవానికి రాజా.. తూర్పుగోదావరి కి చెందిన నాయకుడే అయినప్పటికీ.. ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలు సహా కాపు సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ఇదే.. గత ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు చూసే పరిస్థితిని తీసుకువచ్చింది.
అయితే.. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అయినప్పటికీ.. కాపులకు ఒరిగింది ఏమీ లేదనే వాదన ఈ సామాజిక వర్గంలో కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా నిధుల విడుదల విషయంలో చైర్మన్‌గా ఉన్న రాజా.. ఏమీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక, ఇదే విషయంపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజా ఉద్యమాలు చేశారు. అప్పటి కాపు కార్పొరేషన్ చైర్మన్.. కొత్తపల్లి సుబ్బారాయుడుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.
నిధులు ఇవ్వడం లేదని.. కాపులకు అన్యాయం చేస్తున్నారని.. రాజా వారు గళం వినిపించారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు అప్పట్లో కేసులు కూడా నమోదు చేశారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆయనే కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్నప్పటికీ.. కాపులకు న్యాయం జరగడం లేదని.. ప్రతిపక్షాల బదులు.. ఏకంగా కాపు సామాజిక వర్గమే.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఏటా బడ్జెట్‌లో కాపుల అభ్యున్నతికి రూ.2000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన జగన్ సర్కారు.. మాట తప్పిందని కూడా అంటున్నారు.
ఈ పరిణామం అంతా కూడా రాజాపై పడుతోంది. కాపులకు ఆయన అన్యాయం చేస్తున్నారని.. ఏ ఒక్కరికై నా.. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారా? పైగా కార్పొరేషన్ నిధులను .. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తున్నా.. రాజా మౌనంగా ఉంటున్నారని.. తన స్వార్థం తాను చూసుకుంటున్నారని కాపు యువత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంతో ఇప్పటికే ఒకసారి.. సోషల్ మీడియాపై చిందులు తొక్కిన రాజా.. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అయితే.. రాజాకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ.. తమను తొక్కేస్తున్నారని.. కాపుల్లోనే మరో వర్గం ఆరోపిస్తోంది. మొత్తంగా చూస్తే.. గడిచిన వారం రోజులుగా రాజా వారి పరిస్థితి అడకత్తెరలో పోకగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 4, 2021 10:06 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…