జూపూడి ప్రభాకర్. దాదాపు అందరూ మరిచిపోయిన నాయకుడు. టీడీపీ సర్కారు హయాంలో ఎస్సీ కార్పొరే షన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన దళిత నేత. ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్లుగా ఎక్కడా ఊసులో కూడా లేని జూపూడి ఒక్కసారిగా మీడియాలోకి వచ్చారు. హఠాత్తుగా టీడీపీపైనా.. చంద్రబాబు పైనా.. ఆయన కుమారుడిపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దళితులకు మీరు ఏం చేశారు? అంటూ జూపూడి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ప్రభుత్వం ప్రజలకు డబ్బులు పంచడాన్ని భారీ ఎత్తున సమర్ధించారు. అసలు ప్రభుత్వం ఉన్నదే పప్పుబెల్లాల మాదిరిగా పంపకాలు చేయడానికేనని జూపూడి భాష్యం చెప్పారు. జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నేతలకు ఏమాత్రం లేదన్నారు. మొత్తంగా టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జూపూడి.
అయితే.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత.. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన జూపూడి ఈ రేంజ్‌లో టీడీపీపై విరుచుకుపడడం వెనుక ‘పెద్ద రీజన్’ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఊరికేనే జూపూడి మీడియా ముందుకు రాలేదని అంటున్నారు. పెద్ద ప్లాన్ తోనే జూపూడి జగన్‌ను , ఆయన సర్కారును, సీఎం నిర్ణయాలను వెనుకేసుకు వచ్చారని చెబుతున్నారు.
నిలకడలేని రాజకీయాలు చేయడంలో ముందుండే జూపూడి.. గతంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించిన విషయాన్ని చెబుతున్నారు. అదేసమయంలో వైసీపీ తరఫున కొండపి నుంచి పోటీ చేయడం అక్కడ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. మళ్లీ చంద్రబాబు చెంతకు చేరడం.. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని దక్కించుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ జగన్ చెంతకు చేరిపోయారు.
ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జూపూడి.. ఎమ్మెల్సీ పదవిపై ఆశతోనే టీడీపీని టార్గెట్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ పదవుల్లో ఒకదానిని దక్కించుకునేందుకు జూపూడి చేసిన ప్రయత్నమే ‘ఈ విరుచుకుపడడం’ అంటున్నారు పరిశీలకులు. మరి ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం.. జూపూడి ఇంతగా కష్టపడాలా? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి కూడా ఎదురు కావడం గమనార్హం. మరి దీనికి జూపూడి ఏమంటారో చూడాలి.
This post was last modified on June 4, 2021 9:26 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…