ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? అనే అంశాలు నేటికీ.. అత్యంత రహస్యంగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం నుంచి ఇంకా సంపన్న దేశాలు సైతం కోలుకోలేకపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి అభివృద్ధి చెందుతు న్న దేశం భారత్ వరకు కరోనాపై అవిశ్రాంత పోరును సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనాను అణ్వాయుధాలను మించిన దాడిగా అభివర్ణిస్తూ.. సంచలన కామెంట్లు చేశారు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. ఆనంద్ మహీంద్రా.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అణ్వాయుధాలను మించిన నష్టాన్ని కలిగించిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు వుహాన్ ప్రయోగశాలలో సృష్టించారని, ఈ విలయానికి చైనాయే కారణమని వచ్చిన నివేదికపై ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ‘మనం ఎప్పటికీ నిజం ఏమిటో తెలుసుకోలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాగే జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.’ అని వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ ఇప్పటికే అణ్వాయుధాలను మించిన నష్టాన్ని కలిగించిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నా రు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్న మహీంద్ర.. జీవాయుధాల నిరోధక ఒప్పందం ఆవశ్యకతను వెల్లడించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం మహీంద్ర చేసిన చేసిన ట్వీట్.. జోరుగా వైరల్ అవుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర అనేక వర్గాల ప్రజలకు అండగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది తొలి దశలో లాక్‌డౌన్ కారణంగా.. ఇబ్బందులు ఎదుర్కొన్న వలసకూలీలకు ఆనంద్ ఫౌండేషన్ ద్వారా సేవలందించారు. ఈ ఏడాది కూడా ఆయన సేవలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
This post was last modified on June 2, 2021 6:06 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…