కరోనా మహమ్మారికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారు చేయడం.. అది కాస్త కొద్ది రోజులకే పాపులారిటీ తెచ్చుకోవడం.. వెనువెంటనే ప్రభుత్వం దృష్టి ఆ మందు మీద పడటం.. దానికి అనుమతులు ఇవ్వడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఆనందయ్య మందుకి అనుమతి లభించింది అని తెలియగానే చాలామంది సంబరపడిపోయారు. ఈ మందు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలిస్తే.. వెంటనే వెళ్లి క్యూలు కట్టేద్దామని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసమే.. కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు.
మందు కోసం జనాలు భారీగా క్యూ కట్టడం వల్ల.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. వెంటనే ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ప్రోటోకాల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఈ మందు పంపిణీ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ని కూడా రూపొందిస్తుండటం విశేషం.
మందు తయారీపై వన మూలికలు, ముడి పదార్థాలు సేకరిస్తూనే… మందు పంపిణీపై ఆనందయ్య కార్యాచరణ ఆలోచిస్తున్నారు. మందు పంపిణీ స్టార్ట్ చేయటం మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉండగా, మందు పంపిణీపై ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తో సమావేశం అయ్యారు.
మందు కోసం ఎవరూ నెల్లూరు రావద్దని, అవసరం అయితే మొబైల్ యాప్ ద్వారా… ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆనందయ్య కూడా ఈ అంశానికి మద్ధతు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీ చేస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన జరగదన్నారు. అయితే, ఆనందయ్య పంపిణీ కోసం మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
This post was last modified on June 1, 2021 3:23 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…