Political News

సామాజిక వ‌ర్గ‌మే అడ్డంకి: వీరి ప‌రిస్థితి ఇంతేనా ?

రాజ‌కీయాల్లో కులాల‌కు, రిజ‌ర్వేష‌న్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! సామాజిక వ‌ర్గాల ఆధారంగా ఓటు బ్యాంకును నిర్మించుకున్న నాయ‌కులు, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న‌.. రాజ‌కీయాల్లో రాణించిన నేత‌లు అనేక మంది ఉన్నారు. అయితే.. ఒక‌ప్పుడు.. ఈ సామాజిక వ‌ర్గాలు.. రిజ‌ర్వేష‌న్లు.. చ‌క్రాలు తిప్పితే.. ఇప్పు డు మాత్రం ప‌రిస్థితి కొంద‌రి విష‌యంలో యూట‌ర్న్ తీసుకుంది. అధికార పార్టీ నేత‌ల‌కు ఈ ప‌రిణామం ప్రాణ‌ సంక‌టంగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సామాజిక వ‌ర్గానికి చెందిన రెడ్డి నేతలు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్ర‌మించారు.

అయితే.. వీరిలో చాలా మందికి ప‌ద‌వులు ల‌భించ‌లేదు. ఎవ‌రిమాటో ఎలా ఉన్నా.. గుంటూరుకు చెందిన సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే, మాచ‌ర్ల ఎమ్మెల్యే విప్‌.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఇప్పుడు కుల‌మే పెద్ద మైన‌స్ అయ్యి కూర్చొంది. మాచ‌ర్ల‌లో తిరుగులేని వ‌రుస విజ‌యాలు.. గుంటూరు జిల్లాలో దూకుడు.. వంటి నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంది. అయితే.. ఆయ‌న‌కు సామాజిక వ‌ర్గ‌మే అడ్డంకిగా మారింది. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటినా.. ఆయ‌నకు ఇప్ప‌ట్లో మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదే జిల్లాలో రెడ్ల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? లేదా ? అన్న సందేహం ఉంది. ఒక‌వేళ జ‌గ‌న్ రెడ్ల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి ఇప్ప‌టికే మాట ఇచ్చి ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా పార్టీ కోసం.. కృషి చేశారు. ఈయ‌న‌కు కూడా ఇదే త‌ర‌హాలో సామాజిక వ‌ర్గం అడ్డు వ‌స్తోంది. అదేవిధంగా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా.. ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు. ఇలా.. ప్ర‌తి జిల్లాలోనూ.. అర్హ‌త‌లు ఉన్నా.. పార్టీకి అత్యంత విధేయులు అయినా.. కూడా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో వారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం లేదు.

ఈ విష‌యం పార్టీ నేత‌లే ఓపెన్‌గా చెప్పేసుకుంటున్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌.. స‌హా ప‌లువురు.. నేత‌లు ఇదే విధ‌మైన ప్ర‌తికూల ప‌రిస్థితి ఎదుర్కొనడం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌డం ఖాయ‌మ‌ని సంకేతాలు అందుతున్నా.. వీరికి మాత్రం ఛాన్స్ చిక్కే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 29, 2021 7:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

2 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

7 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

10 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

11 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

12 hours ago