నేతల మధ్య రాజకీయం.. పార్టీకి, పార్టీ అధినేతకు శాపంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అది కూడా రాజకీయంగా కీలకమైన విజయవాడలో కావడం గమనార్హం. విజయవాడ టీడీపీ నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడం వంటివి పార్టీనే కాకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఇబ్బందికరంగా మారాయి. నిజానికి ఏదైనా సమస్య వస్తే.. నేతల మధ్య సర్దు బాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది.
విజయవాడ పరిస్థితిని తీసుకుంటే.. ఇక్కడి నేతలు కూడా అందరూ సీనియర్లే. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ కూడా సమన్వయంతో ముందుకు సాగడం లేదు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తిన ఆధిపత్య పోరు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ వివాదాన్ని సర్దు బాటు చేసే ఉద్దేశంతో చంద్రబాబు జోక్యం చేసుకుని.. తానే స్వయంగా ప్రచారంలోకి దిగారు. అయితే.. ఇది స్వయంగా ఏ నేతకు కూడా స్వాంతన కలిగించలేదు.
అంటే.. చంద్రబాబు.. నేరుగా చెప్పకపోయినా.. ఎంపీ కేశినేని నానిని సమర్ధిస్తున్నారని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న,మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటివారు భావించే పరిస్థితి తెచ్చింది. పోనీ.. నానీ అయినా.. యాక్టివ్ అయ్యారా? అంటే.. అది కూడా లేదు. తన ఇగో శాటిస్ ఫై కాలేదని ఆయన ఫీలవుతున్నారు. అంటే.. చంద్రబాబు తనను హైలెట్ చేయడం లేదని.. ఎంపీ నాని ముభావంతో ఉన్నారు. అటు బుద్ధా, బొండా మాత్రం చంద్రబాబు సొంత కులానికి చెందిన ఎంపీకే సపోర్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.
ఇక గద్దె లాంటి వాళ్లతోనూ బుద్ధా, బొండాకు పొసగని పరిస్థితి. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా అంటే వీళ్లలో ఎవరికి పడదు. ఇలా ఎవరికి వారు.. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం చేసుకుంటున్న పోరాటం.. వ్యక్తిగతాలు దాటి చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్టుగా పేర్కొంటున్నారు పరిశీలకులు. నిజానికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు.. నాయకులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వివాదంలో చంద్రబాబుకు తలనొప్పులు ఎప్పుడు తప్పుతాయో అంటున్నారు.
This post was last modified on May 27, 2021 8:11 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…