Political News

ఇప్పుడు కానీ తిరుమ‌ల‌కు వెళ్తే..

ఎంత ర‌ద్దీ త‌క్కువున్న స‌మ‌యంలో తిరుమ‌ల‌కు వెళ్లినా, ముందుగా ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్నా.. శ్రీవారి ద‌ర్శ‌నం పూర్తి కావ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌యం ప‌డుతుంటుంది. గ‌త కొన్నేళ్ల‌లో ప‌రిస్థితులు ఎంతో మెరుగు ప‌డ్డాయి కానీ.. ఒక‌ప్పుడు స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం 10-20-30 గంట‌లు కూడా ప‌ట్టేసేది. త‌ర్వాత ప‌రిస్థ‌ఙ‌తులు మారాయి. 300 రూపాయ‌ల టికెట్ బుక్ చేసుకుంటే గంట‌న్న‌ర నుంచి నాలుగైదు గంట‌ల వ్య‌వ‌ధిలో ద‌ర్శ‌నం పూర్త‌వుతోంది. మ‌రీ త‌క్కువ స‌మ‌యంలో ద‌ర్శ‌నం పూర్తి కావాలంటే.. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న‌మే మార్గం. అందులో వెళ్తే అర‌ గంట‌ లోపే ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని బ‌య‌టికి వ‌చ్చేయొచ్చు. ఐతే ఇప్పుడు తిరుమ‌ల‌లో భ‌క్తులంద‌రూ వీఐపీ హోదా అందుకునే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఎవ‌రు ద‌ర్శ‌నానికి వెళ్లినా పావు గంట నుంచి అర‌గంట‌లోపు ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని బ‌య‌టికి వ‌చ్చేస్తుండ‌టం విశేషం.

కొవిడ్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. చాలా చోట్ల లాక్ డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో శ్రీవారి ద‌ర్శ‌నం గురించి ఎవ‌రూ ఆలోచించే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా, ప‌క్క జిల్లాల వాళ్లు మాత్ర‌మే ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. గ‌త ఏడాది లాక్ డౌన్ టైంలో కొన్ని నెల‌ల పాటు ద‌ర్శ‌నాలే ఆపేశారు. ఆ త‌ర్వాత ఎన్నో ష‌ర‌తులు పెట్టారు.

అయితే ఇప్పుడు ఏపీలో క‌ర్ఫ్యూ ఉంది కానీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి ఆంక్ష‌లేమీ లేవు. రోజుకు 20 వేల మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం రోజు మొత్తంలో 5 వేల మందికి మించి ద‌ర్శ‌నం చేసుకోవ‌ట్లేద‌ట‌. దీంతో భ‌క్తుల‌ను క్యూ లైన్లలో కాకుండా నేరుగా సింహ ద్వారం నుంచే ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. ఇది ఒక ర‌కంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం లాంటిదే. దీంతో 15-20 నిమిషాల్లోనే ద‌ర్శ‌నం పూర్తి చేసుకుని ప‌ర‌మానందం పొందుతున్నారు భ‌క్తులు.

This post was last modified on May 17, 2021 7:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

4 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

4 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

5 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

5 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

5 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

5 hours ago