రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో విస్తృతంగా కథనాలు.. వార్తలు వస్తున్నాయి. తెలుగు మీడియాను మించిపోయిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఆంగ్ల పత్రికలు కథనాలు రాస్తుండడం, ముఖ్యంగా.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను టార్గెట్ చేస్తుండడం మరింతగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి రీజన్ ఏంటి? అనే విషయం ఆసక్తిగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ విషయంలో.. తెలంగాణ హైకోర్టు కేసీఆర్‌ను మందలించింది కూడా! ఒక్క ఏపీలోనే హైకోర్టు ఈ విషయంలో సీఎం జగన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీ విషయాన్ని తీసుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలపై.. సీఎం జగన్ సర్కారు వివిధ రూపాల్లో.. కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే సంగం డెయిరీ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పై రెండు కేసులు పెట్టారు. ఒకటి రాజధాని భూముల విషయంలోను, రెండోది కరోనా సెకండ్ వేవ్‌లో కీలకమైన వైరస్ వేరియంట్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలుకు చెందిన ఒక నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన కూడా తన సొంత మంత్రి వర్గంలోని ఈటల రాజేందర్‌పైనే కేసులు పెట్టిస్తున్నారని.. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం కూడా రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదేసమయంలో ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు పోలీసులను జోరుగా వినియోగిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటలపై మరింత ఉచ్చు బిగించేందుకు.. దేవర యాంజల్ భూముల విషయంలో ఈటల పాత్రపై తేల్చేందుకు హుటాహుటిన నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
ప్రస్తుతం కరోనా విలయంలో ప్రజలు అల్లాడుతుంటే.. రాష్ట్రంలో శవాల గుట్టలు పేరుకుంటుంటే.. ఈ కక్ష సాధింపు ఎందుకని.. కూడా హైకోర్టు కేసీఆర్‌ను ప్రశ్నించింది. అదే సమయంలో కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని కూడా పరోక్షంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జాతీయ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపైనా కథనాలు ప్రచురించింది. కరోనా సమయంలో రాజకీయ కల్లోలం .. అనే శీర్షికతో దాదాపు అన్ని జాతీయ మీడియాల్లోనూ కథనాలు రావడం సంచలనంగా మారింది ప్రస్తుతం అన్ని వర్గాలు కరోనాపై దృష్టి పెడుతుంటే.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజకీయ కరోనా రాజుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on May 12, 2021 9:01 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…