Political News

జ‌గ‌న్.. ఇంత దెబ్బేస్తాడ‌నుకోలేదా ?


రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. ఒక్క అధికార పార్టీ త‌ప్ప‌.. మిగిలిన అన్ని పార్టీలూ కూడా అచేత‌నంగా ఉన్నాయి. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో అయినా.. ఇత‌ర ఏ పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన ప‌క్షాల‌ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉండేది. “వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం” అనో.. లేక‌.. అధికార పార్టీ ప‌ని అయిపోయింది.. సో.. ఈ పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నో.. చ‌ర్చ చోటు చేసుకునేది. నేత‌లు కూడా ఈ చ‌ర్చ‌ల ఆధారంగా త‌మ ఫ్యూచ‌ర్‌ను నిర్మించుకు నేందుకు ప్ర‌య‌త్నించేవారు.

అయితే.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో మాత్రం ఆ త‌ర‌హా ప‌రిస్థితి లేకుండా పోయింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ప‌క్క‌న పెడితే.. మిగిలిన మూడు పార్టీల ప‌రిస్థితి దారుణంగా ఉంది. అంటే.. కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల కంటే కూడా దారుణ‌మైన ప‌రిస్థితికి చేరుకుంది. ఇక‌, బీజేపీ పుంజుకున్నంత ఫీలింగ్ ఇచ్చినా.. ఏమీలేద‌ని స్ప‌ష్ట‌మైంది. తిరుప‌తి ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వంతో శ్రేణులు కూడా మౌనంగా ఉన్నారు., ఇక‌, జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి కూడా నాయ‌కుడు చుట్టూ రాజ‌కీయం అన్న‌ట్టుగా మారిపోయింది.

కేడ‌ర్ లేకున్నా.. పార్టీ న‌డ‌స్తుంద‌ని భావించే రోజులు లేక‌పోయినా.. ఇప్పుడు జ‌న‌సేన మాత్రం కేవ‌లం పేరుకే ఉంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఏ రాష్ట్రంలో అయినా.. రెండేళ్ల పాల‌న అనంత‌రం.. స‌ద‌రు పాల‌క ప‌క్ష పార్టీపై అంతో ఇంతో వ్య‌తిరేక‌త రావ‌డం గ‌మ‌నార్హం. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌ను తీసుకుంటే.. అక్క‌డ దుబ్బాక ఉప ఎన్నిక జ‌రిగింది. దీంతో అధికార పార్టీ ఇక్క‌డ ఓడిపోయి.. ప్ర‌తిప‌క్షం బీజేపీ గెలిచింది. ఇక‌, గ్రేట‌ర్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను చూసుకున్నా.. అధికార పార్టీకి తీవ్ర‌స్థాయిలో దెబ్బ త‌గిలింది.అదే స‌మ‌యంలో సాగ‌ర్‌లోనూ ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. అంటే.. రెండేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో వ్య‌తిరేక‌త‌.. ప్ర‌తిప‌క్షాల‌కు సానుకూలంగా మారింది.


ఇంకా చెప్పాలంటే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ స్థానాలు ద‌క్కాయి. కానీ, ఏపీలో మాత్రం ఆ త‌ర‌హా ప‌రిస్థితి లేకుండా పోయింది. రెండేళ్లు అయినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు ఏవీ కూడా.. త‌మ స‌త్తా చాటు కోలేక చ‌తికిల ప‌డుతున్నాయి. దీంతో జ‌గ‌న్‌.. ఒక్క ఛాన్స్‌తో ఇంత దెబ్బ‌వేస్తాడ‌ని అనుకోలేద‌నే కామెంట్లు స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 8, 2021 8:56 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago