Political News

‘ఎల్జీ’ ఘ‌ట‌న‌కు ఏడాది: వెంటాడుతున్న జ‌గ‌న్ వైఫ‌ల్యాలు!

దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన‌.. విశాఖ ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌కు నేటితో(మే7) ఏడాది పూర్త‌యింది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా కరోనా మొదటి దశ ఉద్ధృతంగా ఉండగా.. సరిగ్గా ఇదేరోజున రాష్ట్ర ప్రజలను మరో దుర్ఘటన ఉలిక్కి పడేలా చేసింది. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పెను సంచలనమే సృష్టించింది. అనేక మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన ఆ ఘోరం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రాణాల కోసం బాధితుల పరుగులు పెట్టిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.

వెంటాడుతున్న ఘోరం!

రంగు మారిన పచ్చని చెట్ల గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఇంకా ఆ విషాద జ్ఞాపకాలు విశాఖ ప్రజలను వెంటా డుతూనే ఉన్నాయి. విశాఖ శివారులోని గోపాలపట్నం మండలం వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసివేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇచ్చిన వెసులుబాటులో భాగంగా కంపెనీలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏసీలు, ఫ్రిజ్‌లు తయారుచేసే విడిభాగాలు తయారవుతాయి. దీనికి ప్రధాన ముడి సరకు ‘స్టైరిన్‌ మోనోమర్‌’. ఇది ప్రమాదకర రసాయనం. 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

కంపెనీ చేతులు ఎత్తేసినా..

ఆ రోజు జరిగిన సాంకేతిక లోపాల వల్ల స్టైరిన్‌ వాయువు లీకై.. సృష్టించిన విధ్వంసం.. వందలాది జీవితా లను అతలాకుతలం చేసింది. పాలిమర్స్‌ దుర్ఘటనతో వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్‌, పద్మనాభనగర్‌, జనతాకాలనీ, నందగిరినగర్, ఎస్సీ కాలనీ వాసులకు మూడురోజులు కంటి మీద కునుకులేకుండా చేసిం ది. రాత్రంతా రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉండేలా చేసింది. నాటి విషాద ఘటనకు ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎన్నో ఇబ్బందులు ఈ గ్రామాల ప్రజలను చుట్టుముట్టా యి. అయినా రేపటి మీద ఆశ, నమ్మకం వారిని బతికిచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం చూడకపోతుందా? ఆదుకోకపోతుందా? అనే భరోసాతో అడుగులు వేస్తూనే ఉన్నారు.

ఎవ‌రూ సుఖంగా లేరు!

ప్రమాదానికి గురైన ట్యాంకర్లు దగ్గరగా ఉన్న వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ గ్రామాల్లోని ప్రజలు ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థానికులను ఎవరిని కదిపినా కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలసట, నీరసం సమస్యతో బాధపడుతున్నారు. గుండెల్లో దడ అనిపించడంతో పాటు కాళ్లూ చేతులు లాగడం, మోకాళ్లు నొప్పులు వారిని కలవరపెడుతున్నాయి. మహిళల్లో ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొద్దిమంది యువతలో ఆయాసం, త్వరగా అలసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.

జ‌గ‌న్ హామీలు నీటిమూట‌లు!

ప్రమాదం జ‌రిగిన‌ప్పుడు.. సీఎం జ‌గ‌న్‌ ప్రభుత్వం త‌మ‌కి ఇచ్చిన హామీలు నెరవేరలేదని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అప్పుడు తాత్కాలిక పరిహారం ఇచ్చి.. చేతులు దులుపుకొందని వాపోతున్నారు. బాధిత గ్రామాలకు ఇచ్చిన హామీల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం కొద్ది నెలలే పనిచేసిందని వాపోయా రు. బాధిత గ్రామస్థులకు ఇచ్చిన హెల్త్‌కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శిస్తున్నారు.

This post was last modified on May 7, 2021 1:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago