ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ ఏర్పాటు చేసిన రోజే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పటి కేబినెట్లో 90 శాతం మార్పులు, చేర్పులు ఉంటాయని చెప్పారు. జగన్ సీఎం పీఠం ఎక్కి రెండేళ్లు అయిపోయాయి. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ముగిసింది. వైసీపీ అప్రతిహత విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 20 మంది వరకు అవుట్ అవుతారనే చర్చలే స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొత్తగా కేబినెట్లోకి వచ్చే వారు కూడా ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకోవడంతో పాటు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు.
అయితే పదవులు ఆశిస్తోన్న నేతల్లో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మాటకు వస్తే సీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి రెడ్డి వర్గం ఎమ్మెల్యేల్లో చాల మంది సీనియర్లు ఉన్నారు. నాలుగు సార్లు గెలిచిన వారు కూడా మంత్రి పదవులు లేక ఈ సారి ఖచ్చితంగా తమకు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ఆశల పల్లకీలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే సీమకు ముఖద్వారం అయిన కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తోన్న వారంతా రెడ్డి వర్గం నేతలే ఉన్నారు. ఇప్పుడు వీరంతా తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేస్తుండడంతో మంత్రి పదవి ఎవరికి వస్తుందా ? అన్న సందేహం సర్వత్రా ఉంది.
ఇదే జిల్లా నుంచి బీసీ వర్గం మంత్రిగా గుమ్మనూరు జయరాం, రెడ్డి వర్గం కోటాలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నారు. జయరాంపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన నియోజకవర్గంలో కొన్ని షాకులు తప్పలేదు. అవుట్ మంత్రుల లిస్టులో ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. జయరాంను తప్పిస్తే జిల్లాలో రెండో మంత్రి పదవికి ఆరేడు మంది రెడ్డి నేతలు రేసులో ఉన్నారు. వీరిలో శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి తదితర సీనియర్ నేతలు ఉన్నారు.
వీరిలో కాటసాని లాంటి వాళ్లు ఏకంగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు. మిగిలిన నేతలు రెండు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు కూడా ఉన్నారు. బుగ్గను కంటిన్యూ చేస్తే రెండో మంత్రి పదవి కూడా రెడ్డికే ఇవ్వాలి. లేదా బుగ్గను తప్పించే సాహసం చేసి ఆ స్థానంలో రెడ్డి నేతను మంత్రిని చేస్తారా ? అన్నది మాత్రం కాస్త డౌటే ? మరి జగన్ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో ? చూడాలి.
This post was last modified on May 7, 2021 8:54 am
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…