అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు నిర్ణయాల్ని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అందునా కీలకమైన విషయాల్లో వారు వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారికి చెక్ పెట్టటం అంత తేలికైన విషయం కాదు.. అమెరికా.. యూరప్ లాంటి అత్యున్నత సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయినప్పటికి భారీ ఎత్తున మరణాలు తప్పలేదు. అలాంటిది అవగాహన అంతంతమాత్రంగా ఉండటం.. సాంకేతికత పెద్దగా లేని మన దేశంలో కరోనాకు అవకాశం ఇస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది.. సెకండ్ వేవ్ విషయంలో స్పష్టమైంది.
కేంద్రంలోని మోడీ సర్కారుతో పోలిస్తే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న కర్ప్యూ నిర్ణయం సరైదనే చెప్పాలి. పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్న వేళ.. ఈ రోజు (బుధవారం) నుంచి అమలు కానున్న పరిమితులు కేసుల నియంత్రణకు దోహదపడుతుందని చెప్పాలి. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తిస్థాయిలో కర్ప్యూ అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా బస్సులు కూడా తిరగవని చెప్పటం ద్వారా.. పరిమితులతో కూడిన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారని చెప్పాలి.
అంతేకాదు.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల్ని సైతం పూర్తిగా నిలిపివేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి మొదలయ్యే ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పటం ద్వారా.. ప్రజలెవరూ బయటకు రాకూడదన్న విషయాన్ని సీరియస్ గా చెప్పినట్లైంది. కోవిడ్ పరీక్షల్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టి.. ఫలితాల్ని 24 గంటల్లోపే వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
తాజాగా తీసుకున్న నిర్ణయాలన్ని కూడా కోవిడ్ వ్యాప్తికి కళ్లాలు వేసేలా ఉన్నాయి. అయితే.. ఈ నిర్ణయాలన్నింటిని రెండు వారాల ముందే తీసుకొని ఉంటే.. ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితి ఏపీలో ఉండేది కాదని చెప్పక తప్పదు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. కోవిడ్ లాంటి వాటి విషయంలో వీలైనంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తించారని చెప్పాలి. అంతేకాదు.. ఆక్సిజన్ సరఫరా కోసం సింగపూర్ నుంచి ప్రత్యేకంగా 25 వాహనాల్ని తెప్పించాలని నిర్ణయించటం సానుకూలాంశంగా చెప్పక తప్పదు.
This post was last modified on May 5, 2021 10:52 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…