తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఇక, పుంజుకునేది లేదని.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని భావిస్తున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. అది కూడా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పుంజుకుంది. లింగోజీ గూడ కార్పొరేటర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం దక్కించుకుంది.
వాస్తవానికి గత రెండు నెలల కిందట జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇక, కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయిందని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే.. లింగోజీగూడ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ ముఖ్య నేతలు రిక్వెస్ట్ చేయడంతో.. టీఆర్ఎస్ తరఫున ఎవర్నీ పెట్టలేదు.
దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవచ్చన్న బీజేపీకి ఊహించని రీతిలో కాంగ్రెస్ షాకిచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌కు నూతన ఉత్సాహం వచ్చినట్లుయ్యింది. కాగా.. లింగోజిగూడ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్, జల్ల నాగార్జున, షేక్ ఫర్వేజ్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పేల్లి రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ తాజా విజయంతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేట్ల సంఖ్య మూడుకు చేరుకుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉండేవని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 2:13 pm
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…
ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’,…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ విడుదలకు ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివ దర్శకత్వంలో…
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత…
మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్…
https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు…